సెప్టెంబర్ 22న అమెరికా లోని హౌస్టన్ NRG స్టేడియంలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగించారు. ఆ స్టేడియం లో భారీ విల్లు మరియు గద బొమ్మలను పెట్టినట్టు ఒక ఫోటోని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్ : హౌస్టన్ లో ప్రధానమంత్రి మోడీ ప్రసంగించిన NRG స్టేడియం లో భారీ విల్లు మరియు గద బొమ్మలను పెట్టారు.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని భారీ విల్లు మరియు గద బొమ్మల ఫోటో ఢిల్లీ లోని ‘DLF Promenade’ మాల్ లో తీసింది. 2017 లో దీపావళి వేడుకల్లో భాగంగా మాల్ ని అలా అలంకరించారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటో ‘DLF City Centre Mall Chandigarh’ లో తీసినట్టు ఒక వెబ్ సైట్ లో ఉంటుంది. కానీ, ఆ బిల్డింగ్ ఫోటోలు చూస్తే పోస్ట్ లోని ఫోటోతో సరిపోవు. పోస్ట్ లోని ఫోటోలో ‘Steve Madden’ షాప్ కనిపిస్తుంది. కాబట్టి, గూగుల్ లో ‘Steve Madden DLF’ అని వెతకగా, అదే షాప్ ఫోటో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ షాప్ ఢిల్లీ లోని ‘DLF Promenade’ మాల్ లో ఉందని తెలుస్తుంది.

పోస్ట్ లోని ‘Steve Madden’ షాప్ ఫోటో మరియు ‘DLF Promenade’ మాల్ వెబ్ సైట్ లోని ‘Steve Madden’ షాప్ ఫోటో మ్యాచ్ అవుతాయి.

అంతేకాదు, 2017 లో దీపావళి వేడుకల్లో భాగంగా మాల్ ని అలా అలంకరించినట్టు ‘DLF Promenade’ వారు తమ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిన ఫోటో మరియు వీడియో కూడా చూడవచ్చు.
Diwali celebrates triumph of light over darkness.@PromenadeDLF supports safe and noise free Diwali!#myrighttobreathe #greendiwali pic.twitter.com/wrFzA7tDxa
— DLF Promenade (@PromenadeDLF) October 12, 2017
చివరగా, ఫోటోని 2017 లో ఢిల్లీ లోని ‘DLF Promenade’ మాల్ లో తీసారు, NRG స్టేడియం లో కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?