Fake News, Telugu
 

‘నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వారిని నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు.’ అని ఎల్.కే. అద్వానీ అనలేదు

0

ఎన్నికల రాజకీయాలకు అద్వానీ దూరంగా వెళ్ళిపోతూ మోడీ మరియు అమిత్ షా మీద కామెంట్ చేసారని చెప్తూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఎల్.కే. అద్వానీ: ‘ నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వారిని నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఎన్నికల రాజకీయాలకు గుడ్ బై.’

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చేపినట్టుగా అద్వానీ ఎన్నికల రాజకీయాలకు గుడ్ బై చెప్పలేదు. బీ.జే.పీ పార్టీ పదవులకు రాజీనామా చేసినప్పుడు ప్రత్యక్షంగా మోడీ మరియు అమిత్ షా ని అన్నట్టుగా ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు. కానీ తన రాజీనామా లేఖ లో మాత్రం పరోక్షంగా బీ.జే.పీ మరియు కొందరు నాయకులను విమర్శించారు.

గూగుల్ లో ‘Advani Goodbye to politics’ అని సెర్చ్ చేసినప్పుడు అద్వానీ ఇంకా లోక్ సభ ఎంపీ గా ఉన్నారని తెలుస్తుంది మరియు తను వదిలేసినట్టు ఎక్కడా సమాచారం లేదు. అలానే సెర్చ్ రిజల్ట్స్ లో 2013 లో బీ.జే.పీ పార్టీ పదవులకు రాజీనామా చేసినప్పుడు రాసిన లేఖ తో కూడిన ఇండియా టుడే ఆర్టికల్ ఒకటి వస్తుంది. ఆ లేఖను చదివితే అద్వానీ బీ.జే.పీ నాయకులతో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది కానీ ప్రత్యక్షంగా ఎవరిని ఏమీ అనలేదు. అదేవిధంగా బీహార్ ఎలక్షన్ లో బీ.జే.పీ ఓటమి తర్వాత కూడా నలుగురు సీనియర్ లీడర్స్ రాసిన ఒక లేఖలో కూడా ప్రత్యక్షంగా ఎవరిని విమర్శించలేదు

చివరగా, అద్వానీ ఎన్నికల రాజకీయాలకు గుడ్ బై చెప్పలేదు. అలాగే బీ.జే.పీ పార్టీ పదవులకు రాజీనామా చేసినప్పుడు ప్రత్యక్షంగా మోడీ మరియు అమిత్ షా మీద ఎటువంటి విమర్శ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll