Fake News, Telugu
 

స్వచ్ఛ సర్వేక్షన్‌ 2019 ర్యాంకులు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే రిలీజ్ అయ్యాయి. జగన్ పాలనకి వాటికి సంబంధం లేదు

0

స్వచ్ఛ సర్వేక్షన్‌ 2018 తో పోలుస్తే, 2019 ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాల ర్యాంకులు పడిపోవడానికి కారణం వై.ఎస్.జగన్ ప్రభుత్వం అని చెప్తూ, వ్యంగ్యంగా శుభాకాంక్షలతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జగన్ ప్రభుత్వ హయంలో స్వచ్ఛ సర్వేక్షన్‌ 2019 ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాల (తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నం) ర్యాంకులు పడిపోయాయి.

ఫాక్ట్ (నిజం): స్వచ్ఛ సర్వేక్షన్‌ 2019 ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాల (తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నం) ర్యాంకులు పడిపోయాయి అనేది వాస్తవం. కానీ, స్వచ్ఛ సర్వేక్షన్‌ 2019 ర్యాంకులను మార్చి-2019 లోనే రిలీజ్ చేసారు. అప్పటికి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది. స్వచ్ఛ సర్వేక్షన్‌ 2020 ర్యాంకింగ్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. కావున పోస్ట్ లో జగన్ ప్రభుత్వ హయంలో ర్యాంకులు పడిపోయాయి అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్టులోని ఫోటోలను పెట్టి టీడీపీ నేత నారా లోకేష్ కూడా వైకాపా పాలనలో పడిపోయిన ‘స్వచ్ఛత’ ర్యాంకులు అని తన అధికారిక ఫేస్బుక్ (ఆర్కైవ్డ్) మరియు ట్విట్టర్ (ఆర్కైవ్డ్) అకౌంట్లలో పోస్ట్ చేసాడు.

పోస్టులో ఇచ్చిన 2018 మరియు 2019 స్వచ్ఛ సర్వేక్షన్‌ ర్యాంకులు సరైనవేనని ఇక్కడ (2018 ర్యాంకింగ్స్) మరియు ఇక్కడ (2019 ర్యాంకింగ్స్) చూడవొచ్చు.

కానీ, స్వచ్ఛ సర్వేక్షన్‌ 2019 ర్యాంకులను మార్చి-2019 లోనే రిలీజ్ చేసారు. 2019 ర్యాంకులు ఇవ్వడానికి చేసిన సర్వే కూడా జనవరి-2019 లో జరిపినట్టు స్వచ్ఛ సర్వేక్షన్‌ 2019 రిపోర్ట్ లో చదవొచ్చు. అప్పటికి చంద్రబాబు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది. రిపోర్ట్ లో కూడా మార్చ్ లో ఈ ర్యాంకింగ్స్ రిలీజ్ చేసినట్టు చూడొచ్చు.

స్వచ్ఛ సర్వేక్షన్‌ 2020 ర్యాంకులు ఇంకా రిలీజ్ అవ్వలేదు. ‘Swachh Survekshan League (quarter 1 and quarter 2)’ రిజల్ట్స్ ను విడుదల చేసారు. స్వచ్ఛ సర్వేక్షన్‌ 2020 ను జనవరి 4 నుండి నిర్వహిస్తారు. కావున, స్వచ్ఛ సర్వేక్షన్‌ 2019 ర్యాంకులు జగన్ ప్రభుత్వం రాక ముందే రిలీజ్ అయ్యాయి. 

చివరగా, స్వచ్ఛ సర్వేక్షన్‌ 2019 ర్యాంకులు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే రిలీజ్ అయ్యాయి. జగన్ పాలనకి వాటికి సంబంధం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll