Fake News, Telugu
 

సిరియా దేశానికి చెందిన ఫోటోని పెట్టి, ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ఫోటోగా ప్రచారం చేస్తున్నారు

0

ఢిల్లీ లో అల్లర్లు చెలరేగినప్పటి నుండి ఇంటర్నెట్ లో చాలా ఫోటోలు మరియు వీడియోలు ఆ ఘర్షణలకు సంబంధించినవిగా షేర్ అవుతున్నాయి. ఒక మహిళ మరియు ముగ్గురు చిన్న పిల్లలు రోదిస్తున్న ఫోటో ని ఫేస్బుక్ లో పెట్టి, అది మత ఘర్షణల్లో తమ కుటుంబికుడిని కోల్పోయిన వారి ఫోటో అని చెప్తూ,  ‘Ban RSS’ ‘Ban BJP’ అనే హాష్ టాగ్ లు పెడుతున్నారు. పోస్టులో చెప్పిన విషయంలో ఎంతవరకు నిజముందో చూద్దాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఢిల్లీ మత ఘర్షణల్లో తమ కుటుంబికుడిని కోల్పోయిన వారి ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటో భారత దేశానికి సంబంధించినది కాదు. 2014 లో ఉత్తర సిరియాలోని అలెప్పో నగరం లోని సహౌర్ పరిసర ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగినప్పుడు, ఆ దాడుల్లో తమ ఇంటిని కోల్పోవడంతో తల్లి తన పిల్లలను ఓదార్చుతున్న ఫోటో అది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.    

ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ‘Getty Images’ వారి ఫోటో లైబ్రరీ లో లభించింది. దాని ప్రకారం, ఆ ఫోటో 14 మే 2014న, ఉత్తర సిరియాలోని అలెప్పో నగరం లోని సహౌర్ పరిసర ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగినప్పుడు, ఆ దాడుల్లో తమ ఇంటిని కోల్పోవడంతో తల్లి తన పిల్లలను ఓదార్చుతున్నప్పటిది. కావున, ఫోటో 2014 ది మరియు సిరియా కి సంబంధించినది.

చివరగా, ఫోటో ఢిల్లీ మత ఘర్షణల్లో తమ కుటుంబికుడిని కోల్పోయిన వారిది కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll