‘సూరి అనే హిందు వ్యక్తి హసీనా అనే ముస్లిం మహిళను ఇంట్లో వంటచేసిపెట్టటానికి పనిమనిషిగా పెట్టుకున్నాడు. ఆమె రోజు తాను ఒన్డే పదార్ధాలలో,ఉమ్మివేసి,తన యూరిన్(ఉచ్చ) పోసి వంట వొండిపెడుతున్నది’ అని చెప్తూ, ఒక న్యూస్ వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: హిందువుల ఇంట ఆహరంలో యూరిన్ కలుపుతూ CCTV వీడియోలో దొరికిన ముస్లిం వంటమనిషి హసీనా.
ఫాక్ట్ (నిజం): ఆహరంలో యూరిన్ కలుపుతూ వీడియోలో కనిపిస్తున్న వంటమనిషి పేరు ‘ఆశా కౌషల్’. తను ముస్లిం మతస్థురాలు కాదు. వీడియోలోని ఘటన 2011 లో భోపాల్ లో రిపోర్ట్ అయ్యింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోలో ఉన్న ఇంగ్లీష్ పదాలతో వెతకగా, ట్విట్టర్ లో షేర్ అవుతున్న వీడియో (ఆర్కైవ్డ్) దొరుకుతుంది. ట్విట్టర్ లో వైరల్ అవుతున్న ‘న్యూస్ 24’ వీడియో యొక్క ఎక్సటెండెడ్ వెర్షన్ యుట్యూబ్ లో దొరికింది. అయితే, దానిలో వంటమనిషి పేరు ఎక్కడా కూడా చెప్పరు. స్క్రీన్ పై కనిపిస్తున్న పదాలతో గూగుల్ లో వెతకగా, ఆ ఘటన కి సంబంధించి ‘ఆజ్ తక్’, ‘టైమ్స్ అఫ్ ఇండియా’, మరియు ‘దైనిక్ జాగరణ్’ వారు ప్రచురించిన ఆర్టికల్స్ మరియు వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి.
వీడియోలోని ఘటన 2011 లో భోపాల్ లో రిపోర్ట్ అయినట్టు ఆర్టికల్స్ లో చూడవొచ్చు. ఇంట్లో సామాన్లు పోతున్నాయని సీసీటీవీ కెమెరాలు పెడితే, వంటమనిషి తమ ఆహారంలో యూరిన్ కలుపుతున్నట్టు తెలిసిందని ఇంటి యజమాని ముఖేష్ సూరి తెలిపారు. ‘టైమ్స్ అఫ్ ఇండియా’ మరియు ‘దైనిక్ జాగరణ్’ ఆర్టికల్స్ లో వంటమనిషి పేరు ‘ఆశా కౌషల్’ అని చూడవొచ్చు. అంతేకాదు, ‘ఇండియా టుడే’ వారితో మాట్లాడుతూ వంటమనిషి ముస్లిం మతస్థురాలు కాదు అని ‘న్యూస్ 24’ జర్నలిస్ట్ ప్రవీణ్ దూబే తెలిపాడు.
చివరగా, ఆహరంలో యూరిన్ కలుపుతూ వీడియోలో కనిపిస్తున్న వంటమనిషి ముస్లిం మతస్థురాలు కాదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?