Fake News, Telugu
 

బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కొవిడ్‌ పాజిటివ్‌ మహిళకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందని ఇంకా నిర్ధారణ కాలేదు

0

హైదరాబాద్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైందని, బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హైదరాబాద్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు; బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ.

ఫాక్ట్: ఇప్పటివరకు ఓమిక్రాన్ వేరియంట్ తెలంగాణలో డిటెక్ట్ అవలేదు. బ్రిటీష్ ఎయిర్వేస్ నుండి హైదరాబాద్ వచ్చిన ఒక 35 సంవత్సరాల మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌గా మాత్రమే నిర్ధారణ అయ్యింది. ఆమెకు ఒమిక్రాన్‌ లేదా డెల్టా వేరియంట్ ఉందా అనేది జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలను అందుకున్న తరువాత మాత్రమే తెలుస్తుంది. వాటి ఫలితాలు రావడానికి సుమారు 2 లేదా ౩ రోజులు పడతాయని తెలంగాణ ప్రభుత్వం యొక్క డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ రావు తెలిపారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

325 అంతర్జాతీయ ప్రయాణీకులకు ఆర్‌టీ-పీసీఆర్‌ (RTPCR) టెస్ట్ చేసినప్పుడు, బ్రిటీష్ ఎయిర్వేస్ నుండి హైదరాబాద్ వచ్చిన ఒక 35 సంవత్సరాల మహిళకు మాత్రమే కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. “ఆమె రంగా రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి, హెల్త్ స్టేటస్ పూర్తిగా బాగుంది, ఎలాంటి లక్షణాలు లేవు.” అని శ్రీనివాస్ రావు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, తెలంగాణ ప్రభుత్వం అన్నారు.

ఇప్పటివరకు ఒమిక్రాన్‌ వేరియంట్ తెలంగాణలో డిటెక్ట్ అవ్వలేదు. బ్రిటీష్ ఎయిర్వేస్ నుండి హైదరాబాద్ వచ్చిన ఒక 35 సంవత్సరాల మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమె నమూనాలు హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపబడ్డాయి. ఆమెకు ఒమిక్రాన్‌ లేదా డెల్టా వేరియంట్ ఉందా అనేది జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలను అందుకున్న తరువాత మాత్రమే తెలుస్తుంది. ఫలితాలు సుమారు 2 లేదా ౩ రోజులు పడతాయి.” అని 02 డిసెంబర్ 2021న జరిగిన ప్రెస్ మీట్ లో శ్రీనివాస్ రావు తెలిపారు.

“మన దేశానికి గాని, మన రాష్ట్రానికి గాని ఒమిక్రాన్ రావటానికి ఇంకా ఎంతో సమయం పట్టే అవకాశం లేదు.” కాబట్టి ప్రజలు మాస్కులు ధరించటం, భౌతిక దూరాన్ని పాటించడం మరియు వాక్సినేషన్ తీసుకోవడం ముఖ్యమని సూచించారు.

భారతదేశంలో మొదటి రెండు ఒమిక్రాన్‌ కేసులు ఇటీవల కర్ణాటకలో రిపోర్ట్ అయ్యాయి. తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులు ఇప్పటివరకైతే నిర్ధారణ అయినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలపలేదు.

చివరగా, బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కొవిడ్‌ పాజిటివ్‌ మహిళకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందని ఇంకా నిర్ధారణ కాలేదు.

Share.

About Author

Comments are closed.

scroll