Fake News, Telugu
 

మహాలక్ష్మి స్కీమ్ డబ్బు కోసం కాంగ్రెస్ ఎంపీ సెల్జా కుమారి ఆఫీస్‌పై ప్రజలు దాడి చేశారు అంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు

0

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చేసిన మహిళల ఖాతాల్లో నెలకు రూ. 8500 వాగ్దానానికి సంబంధించి ‘గ్యారంటీ కార్డులు’ పొందడానికి లక్నోలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మహిళలు తరలి వచ్చారు అనే వార్తల మధ్య, హర్యానా కాంగ్రెస్ ఎంపీ సెల్జా కుమారి ఆఫీసు వద్ద ప్రజలు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసినట్లుగా ఒక్కొక్కరికి ₹8,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు అంటూ సోషల్ మీడియాలో(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒక వీడియో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హర్యానా కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జాను తన కార్యాలయంలో అక్కడి ప్రజలు కాంగ్రెస్ వాగ్దానం చేసినట్లు రూ. 8500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఫాక్ట్(నిజం): హర్యానాలోని ఫతేపూర్‌లోని తోహానాలో 13 జూన్ 2024న జరిగిన విలేకరుల సమావేశంలో సిర్సా ఎంపీ సెల్జా కుమారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న వీడియో. ఈ సంఘటనకు కాంగ్రెస్ ప్రతిపాదిత మహాలక్ష్మి పథకానికి సంబంధం లేదు. మరొక కాంగ్రెస్ నాయకుడు పరమవీర్ సింగ్ మద్దతుదారులు, సింగ్ గది వెలుపల తాళం వేసినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు తలుపు యొక్క గాజు పలకను పగలగొట్టిన సందర్భంలోనిది. కాబట్టి, పోస్ట్‌లో చేసిన దావా తప్పు.

వైరల్ క్లెయిమ్ గురించి తెలుసుకునేందుకు వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ‘ది ట్రిబ్యూన్’ యుట్యూబ్  చానెల్లో ఇదే వీడియోను 14 June 2024న ప్రచురించడం గమనించాం. దీని ద్వారా ఫతేపూర్‌లోని తోహానాలో విలేకరుల సమావేశంలో ఈ సంఘటన జరిగింది అని తెలుసుకున్నాం. ఈ విలేకరుల సమావేశంలో సెల్జా కుమారి సిర్సా లోక్ సభ నియోజకవర్గంలో తన గెలుపునకు సహకరించిన ప్రజలకు మరియు పార్టీ క్యాడర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

దీని గురించి మరింత వెతికితే, మీడియా రేపోర్ట్స్ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ప్రకారం చాలా మంది నాయకులు సమావేశం జరిగే గదిలోకి ప్రవేశించారు. కానీ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి పరమవీర్ సింగ్ మరియు అతని మద్దతుదారులు బయటే ఉండిపోయారు.  సెల్జా కుమారి మీటింగ్ ప్రారంభించినప్పుడు, పరమవీర్ సింగ్ మరియు అతని మద్దతుదారులు తలుపు కొట్టడం మరియు నెట్టడం ప్రారంభించారు, ఇది గందరగోళానికి కారణమైంది. పైగా, పరిస్థితిని శాంతపరచడానికి సెల్జా ప్రయత్నించినప్పటికీ, చివరికి తలుపు యొక్క గ్లాస్ ప్యానెల్ విరిగిపోయింది. లోపలికి ప్రవేశించిన తరువాత, పరమవీర్ సింగ్ తలుపు లాక్ చేయబడిందని ఫిర్యాదు చేసాడు, కానీ సెల్జా అది నిజం కాదు అని తెలిపి ఈ విషయంపై విచారణకు అంగీకరించింది అని తలేసింది.

గతంలో, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి సంబంధించిన క్లెయిమ్‌లను (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఫ్యాక్ట్లీ ప్రచురించిది.

చివరిగా, మహాలక్ష్మి స్కీమ్ డబ్బు కోసం కాంగ్రెస్ ఎంపీ సెల్జా కుమారి ఆఫీస్‌పై ప్రజలు దాడి చేశారు అంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll