Fake News, Telugu
 

బిర్యానీ ఫోటోకి, టాబ్లెట్ల ఫొటోలకి అసలు సంబంధం లేదు. టాబ్లెట్ల ఫోటోలు శ్రీలంక కి సంబంధించినవి

0

Update (11 July 2023):

కోయంబత్తూరులో బిర్యానీలో గర్భనిరోధక మాత్రలు కలిపి హిందువులకు… ముస్లింలు బిర్యానీ సరఫరా చేస్తున్నారు. అమ్మిన ముస్లిం దుకాణదారులు అరెస్ట్…..’ అంటూ కొన్ని ఫొటోలతో ఉన్న పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అయితే క్రింద వివరించినట్టు, బిర్యానీ ఫోటోకి, టాబ్లెట్ల ఫొటోలకి అసలు సంబంధం లేదు, టాబ్లెట్ల ఫోటోలు శ్రీలంకకి సంబంధించినవి. అలాగే కొంతమంది వ్యక్తులు పోలీసులతో ఉన్న ఫోటోలు ఉత్తర్ ప్రదేశ్ లో 2019లో జరిగిన ఘటనకి సంబంధించినవి. వివరాలు ఇక్కడ చూడవొచ్చు.

Published (02 March 2020):

రెండు బోగణలు పెట్టాడు. ఒకటి హిందువుల కోసం, ఇంకొకటి ముస్లిముల కోసం. హిందువులు తినే ఫుడ్ లో కెమికల్ కలపుతున్నాడు’ అని చెప్తూ, కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: హిందువులు తినే ఆహరంలో కెమికల్ కలుపుతున్న ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): బిర్యానీ పట్టుకొని ఉన్న వ్యక్తి ఫోటో కనీసం 2016 నుండి ఇంటర్నెట్ లో ఉంది. టాబ్లెట్స్ ఫోటోలు అసలు భారతదేశంలో తీసినవి కావు. శ్రీలంకలో అమ్మడానికి నిషేధించబడ్డ టాబ్లెట్లను శ్రీలంక స్పెషల్ టాస్క్ ఫోర్సు వారు మే 2019 లో పట్టుకున్నప్పటి ఫోటోలు అవి. బిర్యానీ ఫోటోకి, టాబ్లెట్స్ ఫొటోలకి అసలు సంబంధం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

ఒక వ్యక్తి ప్లేట్ పట్టుకొని ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటో 2016 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. బిర్యానీ తాయారు చేసే విధానం అంటూ యూట్యూబ్ లో ఉన్న కొన్ని వీడియోలకి ఆ ఫోటోని థంబ్‌నైల్ గా పెట్టినట్టు చూడవొచ్చు.

టాబ్లెట్స్ ఫొటోలు సెర్చ్ చేయగా, వాటిని శ్రీలంక కి సంబంధించి 2019 లో ప్రచురించబడిన ఆర్టికల్స్ లో చూడవొచ్చు. అవి శ్రీలంకలో అమ్మడానికి నిషేధించబడ్డ టాబ్లెట్లను శ్రీలంక స్పెషల్ టాస్క్ ఫోర్సు వారు 2019 లో పట్టుకున్నప్పటి ఫోటోలు అని ‘The Daily Mirror’ ఆర్టికల్ లో చూడవొచ్చు. పాకిస్తాన్లో తయారు చేయబడి, శ్రీలంకలో అమ్మడానికి నిషేధించబడ్డ ట్రామాడోల్ మరియు అనేక అక్రమ మందులను కొలంబో లో పట్టుకున్నట్టు ఆర్టికల్ లో చదవొచ్చు. ఆ ఫోటోల్లోని ఆఫీసర్ల ఉనిఫారం కూడా శ్రీలంక స్పెషల్ టాస్క్ ఫోర్సు వారి ఉనిఫారంతో మ్యాచ్ అవుతున్నట్టు చూడవొచ్చు. ఆ ఫోటోలు శ్రీలంక కి సంబంధించిన ఫోటోలని మరికొన్ని ఆర్టికల్స్ లో (ఇక్కడ మరియు ఇక్కడ)  కూడా చూడవొచ్చు.

ఇవే ఫోటోలతో 2019 లో కూడా ఇలాంటి వార్తనే వైరల్ అయినప్పుడు ‘యూ టర్న్’ వారు రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవొచ్చు. వేరే మందుల ఫోటోని పెట్టి కూడా ఇలానే తప్పుగా షేర్ చేస్తున్నట్టు ఇక్కడ చూడవొచ్చు. 

చివరగా, సంబంధం లేని పాత ఫోటోలను పెట్టి, హిందువులు తినే ఆహరంలో కెమికల్ కలుపుతున్నారని షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll