Fake News, Telugu
 

కేరళలోని ‘మాషా అల్లా బిర్యానీ’ హొటల్ లో హిందువులకు సంతానం కలగకుండా మందులు కలుపుతున్నారనేది ఫేక్ న్యూస్

0

కేరళలో ఒక ‘మాషా అల్లా బిర్యానీ’ అనే హోటల్ ఉంది. రెండు పెద్ద పెద్ద పాత్రలలో బిర్యాని అమ్ముతాడు, ఒకటి హిందువులు కొసం , ఇంకొకటి ముస్లింలు కొసం. హిందువుల కోసం అమ్మే దాని లో నపుంసకులు అయ్యేలా మందులు కలిపి చాలా రోజుల నుండి అమ్ముతున్నాడు. హిందువుల అద్రుష్టం వల్ల బయటపడి అర్రెస్ట్ అయ్యాడు. అతను చేసిన పాడుపని పొలిసుల ముందు ఒప్పుకున్నాడు’ అని చెప్తూ, కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళ లో ముస్లింలు నడిపే ‘మాషా అల్లా బిర్యానీ’ హోటల్ లో హిందువులకు పెట్టే బిర్యానీలో సంతానం కలగకుండా మందులు కలుపుతున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. 

ఫాక్ట్ (నిజం): ):  టాబ్లెట్స్ ఫోటోలు అసలు భారతదేశంలో తీసినవి కావు. శ్రీలంకలో అమ్మడానికి నిషేధించబడ్డ టాబ్లెట్లను శ్రీలంక స్పెషల్ టాస్క్ ఫోర్సు వారు మే 2019 లో పట్టుకున్నప్పటి ఫోటోలు అవి. కొంతమంది వ్యక్తులు పోలీసుల తో ఉన్న ఫోటోలు ఉత్తర్ ప్రదేశ్ లో 2019 లో జరిగిన ఘటనకి సంబంధించినవి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫోటో-1 (టాబ్లెట్స్ ఉన్న ఫోటో) : 

ఫోటో ని సెర్చ్ చేయగా, వాటిని శ్రీలంక కి సంబంధించి 2019 లో ప్రచురించబడిన ఆర్టికల్స్ లో చూడవొచ్చు. అవి శ్రీలంకలో అమ్మడానికి నిషేధించబడ్డ టాబ్లెట్లను శ్రీలంక స్పెషల్ టాస్క్ ఫోర్సు వారు 2019 లో పట్టుకున్నప్పటి ఫోటోలు అని ‘The Daily Mirror’ ఆర్టికల్ లో చూడవొచ్చు. పాకిస్తాన్లో తయారు చేయబడి, శ్రీలంకలో అమ్మడానికి నిషేధించబడ్డ ట్రామాడోల్ మరియు అనేక అక్రమ మందులను కొలంబో లో పట్టుకున్నట్టు ఆర్టికల్ లో చదవొచ్చు. ఆ ఫోటోల్లోని ఆఫీసర్ల యూనిఫామ్ కూడా శ్రీలంక స్పెషల్ టాస్క్ ఫోర్సు వారి యూనిఫామ్ తో మ్యాచ్ అవుతున్నట్టు చూడవొచ్చు. ఆ ఫోటోలు శ్రీలంక కి సంబంధించిన ఫోటోలని మరికొన్ని ఆర్టికల్స్ లో (ఇక్కడ మరియు ఇక్కడ)  కూడా చూడవొచ్చు.

ఫోటో 2 & 3 (పోలీసులు ఉన్న ఫోటోలు):

ఫోటోలు 2019 లో ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్నోర్ లో జరిగిన ఒక ఘటన కి సంబంధించినవి.  బిజ్నోర్ లోని ఒక మదర్సా లో అక్రమంగా ఆయుధాలను నిలువ చేశారనే ఆరోపణతో మదర్సా  నిర్వాహుకులను ఆరెస్ట్ చేశారని బిజ్నోర్ పోలీసుల ట్వీట్ ద్వారా తెలుస్తుంది. ఆ ఘటన కి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కావున ఫోటోలు ఉత్తర్ ప్రదేశ్ కి సంబంధించినవి.

చివరిగా,  సంబంధంలేని ఫోటోలను పెట్టి ‘ కేరళ లో ముస్లింలు నడిపే హోటల్ వారు హిందువులకు పెట్టే బిర్యానీలో మందులు కలుపుతున్నందుకు వారిని పోలీసులు అరెస్ట్ చేశారు’ అని చెప్తున్నారు.  

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll