అస్సాంలో పుట్టిన వింత రాక్షస శిశువు అంటూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ శిశువు పట్టుకోవడం వల్ల ఒక హాస్పిటల్ నర్స్ మరణించినట్టు కూడా పోస్ట్ లో పేర్కొన్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: అస్సాంలో పుట్టిన వింత రాక్షస శిశువు వీడియో. ఆ శిశువు పట్టుకోవడం వల్ల హాస్పిటల్ నర్స్ మరణించింది.
ఫాక్ట్ (నిజం): వీడియోలో ఉన్న శిశువు ‘Harlequin Ichthyosis’ అనే మెడికల్ కండిషన్ తో పుట్టింది. ఆ మెడికల్ కండిషన్ తో పుట్టిన పిల్లలు పట్టుకోవడం వల్ల ఎవరూ చనిపోరు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఒక యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చూస్తే, వీడియోలో ఉన్న శిశువు ‘Harlequin Icthyosis’ అనే మెడికల్ కండిషన్ తో పుట్టినట్టు రాసి ఉంటుంది.
Harlequin Icthyosis’ అని గూగుల్ లో వెతకగా, ‘Harlequin Ichthyosis’ అనేది ఒక జెనెటిక్ డిసార్డర్ అని తెలుస్తుంది. ‘ABCA12’ జీన్ లో మ్యుటేషన్ వల్ల ఈ కండిషన్ వస్తుంది. ఇంతకముందు ఈ కండిషన్ తో పుట్టిన పిల్లలు బ్రతకడం కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు ఇంటెన్సివ్ మెడికల్ కేర్ తో పిల్లలు జీవించే అవకాశాలు పెరిగాయని తెలుస్తుంది. ఈ కండిషన్ గురించి మరిన్ని వివరాలను ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.
పోస్ట్ లోని వీడియో ఎక్కడ తీసారనే సమాచారం ఇంటర్నెట్ లో దొరకలేదు. కానీ, ‘Harlequin Ichthyosis’ అని సెర్చ్ చేస్తే వీడియోలో ఉన్న శిశువు లాంటి వేరే చాలా శిశువుల ఫోటోలు మరియు వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. కాబట్టి, వీడియోలోని శిశువు కూడా ‘Harlequin Ichthyosis’ అనే కండిషన్ తో బాధపడుతున్నట్టు నిర్ధారణకి రావొచ్చు. పోస్ట్ లో చెప్పిన కథలో ఎటువంటి నిజం లేదు. ‘Harlequin Ichthyosis’ కండిషన్ తో పుట్టిన పిల్లలు పట్టుకుంటే చనిపోతారని ఎక్కడా కూడా సమాచారం లేదు.
ఈ జెనెటిక్ డిసార్డర్ తో ఇంతక ముందు భారతదేశంలో పుట్టిన పిల్లల మీద వివిధ వార్తాసంస్థలు రాసిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.
చివరగా, వీడియోలోని శిశువు ‘Harlequin Ichthyosis’ అనే మెడికల్ కండిషన్ తో పుట్టింది. తను వింత రాక్షస శిశువు కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: వీడియోలోని శిశువు ‘Harlequin Ichthyosis’ అనే మెడికల్ కండిషన్ తో పుట్టింది. తను వింత రాక్షస శిశువు కాదు - Fact Checkin