Fake News, Telugu
 

పుట్టినరోజు వేడుకలు తన స్నేహితులతో జరుపుకుంటూ చనిపోయిన వ్యక్తి అంటూ షేర్ చేస్తున్న ఈ ఘటన నిజంగా జరగలేదు

0

పుట్టినరోజు వేడుకలు తన స్నేహితులతో జరుపుకుంటూ చనిపోయిన వ్యక్తి అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పుట్టినరోజు వేడుకలు తన స్నేహితులతో జరుపుకుంటూ చనిపోయిన వ్యక్తి వీడియో.

ఫాక్ట్: వీడియో నిజమైంది కాదు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. వీడియోలో 21 నవంబర్ 2021 అని డేట్ ఉన్నా, ఈ వీడియో 02 మార్చ్ 2020న నటి హంస నందిని యొక్క అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసారు. “ఈ పేజీలో స్క్రిప్టెడ్ డ్రామాలు మరియు పేరడీలు కూడా ఉన్నాయి. ఈ షార్ట్ ఫిలిమ్స్ కేవలం విద్యా ప్రయోజనాల (educational purpose) కోసం మాత్రమే” అని ఫేస్బుక్ పోస్టులోనే రాసుంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.        

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక ఫేస్బుక్ వీడియో లభించింది. 02 మార్చ్ 2020న నటి హంస నందిని యొక్క అధికారిక ఫేస్బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేసారు. “ఈ పేజీలో స్క్రిప్టెడ్ డ్రామాలు మరియు పేరడీలు కూడా ఉన్నాయి. ఈ షార్ట్ ఫిలిమ్స్ కేవలం విద్యా ప్రయోజనాల (educational purpose) కోసం మాత్రమే” అని పోస్టులోనే రాసుంది.

వీడియోలో కుడివైపు, కింద కార్నర్ లో చూసినప్పుడు, 21 నవంబర్ 2021 అని డేట్ ఉంది, కానీ వీడియో పోస్ట్ చేసిన డేట్ 02 మార్చ్ 2020. కాబట్టి, ఎప్పుడో చేసిన వీడియోను ఇటీవల జరిగిన విషయంగా షేర్ చేసారు.

వీడియో చివర్లో కూడా ఫేస్బుక్ పోస్టులో చెప్పిన విధంగానే వివరణ ఇచ్చారు. ఇటువంటి వీడియోలు కేవలం అవగాహన (అవేర్నెస్) కోసం మాత్రమే అని.

చివరగా, పుట్టినరోజు వేడుకలు తన స్నేహితులతో జరుపుకుంటూ చనిపోయిన వ్యక్తి అంటూ షేర్ చేస్తున్న ఈ ఘటన నిజంగా జరగలేదు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll