Fake News, Telugu
 

సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో ఏడాది కాలంగా సినీ ప్రముఖులు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు ‘Way2News’ కథనాన్ని ప్రచురించలేదు

0

26 డిసెంబర్ 2024న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా ప్రముఖులు సమావేశం అయ్యారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో, “సినీ ప్రముఖులతో జరిగిన సమావేశంలో ఏడాది కాలంగా సినీ ప్రముఖులు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు” అని పేర్కొంటూ ‘Way2News’ కథనం ప్రచురించట్లు న్యూస్ క్లిప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 26 డిసెంబర్ 2024న సినీ ప్రముఖులతో జరిగిన సమావేశంలో ఏడాది కాలంగా సినీ ప్రముఖులు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.

ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ 27 డిసెంబర్ 2024న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. వాస్తవంగా, సినీ ప్రముఖులతో భేటీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా 26 డిసెంబర్ 2024న సినీ ప్రముఖులతో జరిగిన సమావేశంలో ఏడాది కాలంగా సినీ ప్రముఖులు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. పైగా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది. అలాగే సినీ ప్రముఖులతో భేటీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళా మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అని పేర్కొన్న పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఈ వైరల్ ‘Way2News’ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/b7gy4w) ద్వారా ‘Way2News’  వెబ్‌సైట్‌లో వెతకగా, ఈ సంస్థ 26 డిసెంబర్ 2024న “సినీ ప్రముఖులతో భేటీలో సీఎం ఆవేదన” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త కథనం దొరికింది. నిజానికి, ఈ కథనంలో “సినీ ప్రముఖులతో భేటీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. ఈ భేటీకి మంత్రులు, హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, చిక్కడపల్లి సీఐతో పాటు సినీ పరిశ్రమ నుంచి 46 మంది హాజరయ్యారు” అని పేర్కొంది దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఈ వైరల్ న్యూస్ క్లిప్ ఫోటోను రూపొందించారు అని నిర్థారించవచ్చు.

అంతేకాకుండా, ఈ న్యూస్ క్లిప్ వైరల్ అవడంతో, 26 డిసెంబర్ 2024న ‘Way2News’ సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ (ఆర్కైవ్డ్) ద్వారా స్పందిస్తూ,“ఇది Way2News ప్రచురించిన కథనం కాదు, కొందరు మా ఫార్మాట్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చింది. అలాగే, వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌లోని వెబ్ లింక్‌తో వారు ప్రచురించిన అసలు వార్తను కూడా షేర్ చేశారు.

చివరగా, సినీ ప్రముఖులతో జరిగిన సమావేశంలో ఏడాది కాలంగా సినీ ప్రముఖులు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొంటూ ‘Way2News’ కథనాన్ని ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll