Fake News, Telugu
 

2021లో బెంగళూరులో ఒక బిల్డింగ్ కూలిన వీడియోను షేర్ చేస్తూ వాస్తు నిపుణుడి మాటలు విని పిల్లర్ తొలగించడంతో కూలిపోయిందని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు

0

“బెంగళూరులో వాస్తు నిపుణుడి మాటలు విని ఓ ఇంటి యజమాని తన బిల్డింగ్ ఒక పిల్లర్‌ను తొలగించగా, ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయింది” అని చెప్తూ  వీడియో  ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  బెంగళూరులో వాస్తు నిపుణుడి మాటలు విని ఓ ఇంటి యజమాని తన బిల్డింగ్ ఒక పిల్లర్‌ను తొలగించగా, ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయింది, అందుకు సంబంధించిన దృశ్యాలు . 

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2021లోబెంగళూరులోని కస్తూరి నగర్ ప్రాంతంలో ఓ  బిల్డింగ్ కూలిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ బిల్డింగ్‌లో పగుళ్లు ఏర్పడి ఓ పక్కకు ఒరిగింది. దీంతో  బిల్డింగ్ నివాసితులు బ్రుహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) అధికారులకు సమాచారం ఇచ్చారు. BBMP అధికారులు పరిసర బిల్డింగ్‌లలో నివసించే  ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి, బెంగళూరూ సిటీ పోలీస్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ సహాయం‌తో ఆ బిల్డింగ్‌ను కూల్చేందుకు ప్లాన్ చేస్తున్న క్రమంలోనే 07 అక్టోబర్ 2021న కూలిపోయింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ అవుతున్న వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఇవే దృశ్యాలను కలిగి ఉన్న వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) 08 అక్టోబర్ 2021న  హిందుస్థాన్ టైమ్స్ తన అధికారిక  యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసినట్లు కనుగొన్నాము. 

ఈ వీడియో వివరణ  ప్రకారం, ఈ వీడియో బెంగళూరులోని కస్తూరి నగర్ ప్రాంతంలో మూడు అంతస్తుల  బిల్డింగ్ కూలిపోతున్న  దృశ్యాలను చూపిస్తుంది. బిల్డింగ్‌లో పగుళ్లు ఏర్పడగా, ఓ పక్కకు ఒరిగింది. దీంతో బిల్డింగ్ నివాసితులు ఈ విషయం గురించి బ్రుహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) అధికారులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరూ సిటీ పోలీస్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ సహాయం‌తో ఆ బిల్డింగ్‌ను కూల్చేందుకు ప్లాన్ చేస్తున్న క్రమంలోనే 07 అక్టోబర్ 2021న కూలిపోయింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ఈ సంఘటనకి సంబంధించిన మరింత సమాచారం కోసం తగ్గిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఆగస్టు 2023లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, మరియు ఇక్కడ) (ఆర్కైవ్డ్ లింక్ ఇక్కడ, మరియు ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, 2012-13లో బిల్డింగ్ నిర్మాణ సమయంలో ఈ బిల్డింగ్ ప్లాన్ గ్రౌండ్ ప్లస్ టు అంతస్తుల కోసం ఆమోదించబడింది. అయితే, బిల్డర్ ఆమోదించిన ప్లాన్‌ను అతిక్రమించి మూడు అంతస్తులు నిర్మించడంతో పాటు, పెంటహౌస్‌ను కూడా అక్రమంగా నిర్మించాడు. 

చివరిగా, 2021లో బెంగళూరులో ఓ బిల్డింగ్ కూలిన వీడియోను షేర్ చేస్తూ వాస్తు నిపుణుడి మాటలు విని పిల్లర్ తొలగించడంతో కూలిపోయిందని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll