Fake News, Telugu
 

ముస్లిం డిక్లరేషన్ అమలుకు అవసరమైతే ఆలయ భూములు వేలం వేస్తామని రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ఫేక్ Way2News టెంప్లేట్ షేర్ చేస్తున్నారు

0

Way2News టెంప్లేట్ షేర్ చేస్తూ, ముస్లిం డిక్లరేషన్ అమలుకు నిధులు ఎలా సమీకరిస్తారని ఒక న్యూస్ ఛానెల్ విలేఖరి అడిగిన ప్రశ్నకు  టి-పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, “ముస్లిం డిక్లరేషన్ అమలుకు నిధుల సమీకరణ కోసం అవసరమైతే ఆలయాల భూములను వేలం వేసి వచ్చిన డబ్బులతో ముస్లింలను ఆదుకుంటాము” అని తెలిపారు అంటూ ఒక పోస్టు, మరియు ఇదే క్లైమును NTv ప్రసారం చేసినట్టు మరొక పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. దీని వెనుక ఎంత వాస్తవముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ముస్లిం డిక్లరేషన్ అమలుకు నిధుల సమీకరణ కోసం అవసరమైతే ఆలయాల భూములను వేలం వేసి వచ్చిన డబ్బులతో ముస్లింలను ఆదుకుంటాము అని టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. 

ఫాక్ట్(నిజం): దీని గురుంచి Way2News స్పష్టత ఇస్తూ ఇది వాళ్ళ లోగోను ఉపయోగించి తయారు చేసిన ఫేక్ పోస్ట్ అని ఒక X పోస్టు ద్వారా తెలిపింది. తదుపరి, NTv ఇటువంటి హెడ్లైన్స్ ఏమి ప్రచురించలేదు అని తెలిసింది. పైగా, రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా సమాచారం లేదు. కావున, ఈ పోస్టుల్లో చేసిన క్లెయిమ్ తప్పు. 

ఈ క్లెయిమ్ గురించి తగిన కీ వర్డ్సను ఉపయోగించి వెతకగా ఈ పోస్టు Way2News ప్రచురించిన వార్తల్లో దొరక్కపోగా, “ఇది #Way2News కథనం కాదు. కొంతమంది మా లోగోను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది. ఇది మా ద్వారా ప్రచురించబడలేదని మేము ధృవీకరిస్తున్నాము.” అంటూ వే2న్యూస్ సంస్థ వాళ్ళ X పోస్టు ద్వారా తెలిపింది అని తెలిసింది.

తదుపరి, NTv ప్రచురించిన వార్త గురించి వెతకగా, NTv ఇటువంటి హెడ్లైన్స్ ఏమి ప్రచురించలేదు అని తెలిసింది. పైగా, రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, అన్ని ప్రముఖ మీడియా సంస్థలు దీని గురుంచి రిపోర్ట్ చేసుండేవి. కానీ ఈ క్లైముకు సంబంధించి ఎటువంటి మీడియా రిపోర్ట్స్ దొరకలేదు.

చివరిగా, ముస్లిం డిక్లరేషన్ అమలుకు అవసరమైతే ఆలయ భూములు వేలం వేస్తామని రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ఫేక్ Way2News టెంప్లేట్ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll