Fake News, Telugu
 

ఇతర మతాల పండుగల వేడుకల్లోనే కాదు, వివిధ హిందూ పండుగల వేడుకల్లో కూడా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు

0

వినాయక చవితి, దేవి నవరాత్రి, దసరా ఉత్సవాల్లో కనిపించడు కానీ ఇఫ్తార్ దావత్ లో, క్రిస్మస్ పార్టీలో కనిపిస్తాడు”, అని తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి చెప్తూ, ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇఫ్తార్ దావత్‌లో, క్రిస్మస్ పార్టీలో కనిపించే సీఎం కేసీఆర్, హిందూ పండుగల వేడుకల్లో మాత్రం కనిపించడు.

ఫాక్ట్: వినాయక చవితి, దసరా, మరియు శ్రీ రామ నవమి లాంటి వివిధ హిందూ పండుగల వేడుకల్లో కూడా సీఎం కేసీఆర్ పాల్గొన్నట్టు ఆధారాలు ఉన్నాయి. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

ఏవైనా హిందూ పండుగల వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నాడా అని ఇంటర్నెట్‌లో వెతకగా, తను వివిధ హిందూ పండుగల వేడుకల్లో పాల్గొన్నట్టు తెలిసింది. దసరా వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.

వివిధ సమయాల్లో సీఎం కేసీఆర్ వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న దృశ్యాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, శ్రీ రామ నవమి వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ యొక్క వీడియోని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఇతర మతాల పండుగల వేడుకల్లోనే కాదు, వివిధ హిందూ పండుగల వేడుకల్లో కూడా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

Share.

About Author

Comments are closed.

scroll