Fake News, Telugu
 

ఈ వీడియోలో కనిపించేది స్వీడెన్‌లోని సన్ డాగ్, హిమాలయాల వద్ద మణి దర్శనం కాదు

0

ఈ వీడియోలో జరిగేది మణిదర్శన్ అనే ప్రత్యేక సూర్యోదయం అని అంటూ ఒక పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. మణిదర్శన్ హిమాలయల వద్ద తెల్లవారుజామున 3.30 గంటలకు జరుగుతుంది, దీనిని లార్డ్ శివ విశ్వరూప దర్శనంగా పరిగణిస్తారు అని ఈ పోస్ట్‌లో అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వీడియోలో కనిపించేది మణిదర్శన్ అనే ప్రత్యేక సూర్యోదయం.

ఫాక్ట్: వీడియోలో కనిపించేది స్వీడన్లో 2019 లో జరిగిన సన్ డాగ్ అనే ఆప్టికల్ చర్య, మణిదర్శన్ కాదు. వాతావరణంలోని నీరు చిన్న మంచు స్ఫటికాలుగా గడ్డకట్టవచ్చు. ఈ స్ఫటికాలు నేలకు రాలుతుండగా, ఈ అలైన్‌మెంట్ సమయంలో, ప్రతి స్ఫటికం ఒక చిన్న లెన్స్ వలె చేసి, సూర్యకాంతిని మన దృష్టిలోకి వక్రీభవనం (రిఫ్రాక్ట్) చేస్తుంది. దీన్నే సన్ డాగ్ అని అంటారు. సన్ డాగ్లకు సాంకేతిక నామం పరహిలియో. హిమాలయాలలో మణి మహేష్ శిఖరంపై సూర్యోదయం అయినప్పుడు పక్కన సరస్సు లో శివుడి కిరీటంపై సూర్యుడు వజ్రంలా ప్రకశిస్తున్నట్టు కనబడుతుంది, దీనిని మణిదర్శన్ అని పిలుస్తారు. ఈ రెండిటికీ సంబంధం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు అదే వీడియో యూట్యూబ్ లో లభించింది. 03 జనవరి 2019న అప్లోడ్ చేసిన ఈ వీడియో టైటిల్, ‘రేర్ సైట్ అఫ్ ఏ సన్ డాగ్ (పరహిలియో)’. 13 జనువరి 2019 న పబ్లిష్ చేసిన ఒక ట్విట్టర్ పోస్ట్ లో కూడా ఈ వీడియో సన్ డాగ్ (పరహిలియో) గా తెలిపారు. చల్లగా ఉన్నప్పుడు చంద్రుడు, సూర్యుడు యొక్క హాలోస్ కనబడతాయని, ఈ ప్రక్రియ స్వీడన్‌లో రెండు రోజుల క్రితం జరిగినట్టు ఆ ట్వీట్ లో చూడొచ్చు.

ఇది సన్ డాగ్ అని క్లూ తీసుకొని, దాన్ని కీ వర్డ్ గా తీసుకొని సెర్చ్ చేసినప్పుడు కొన్ని ఆర్టికల్స్ మరియు వీడియోలు లభించాయి. మాస్కో, రష్యాలో 2014లో జరిగిన సన్ డాగ్ (పరహిలియో) మరియు 2018లో స్వీడన్‌లో జరిగిన సన్ డాగ్ విజువల్స్ పోస్ట్ లోని వీడియోతో పోలిఉన్నాయి.

స్వీడన్‌లో జరిగిన సన్ డాగ్ అనే చర్యని నాసా వారు కూడా వివరించారు. కొన్నిసార్లు సూర్యుడిని ఒక పెద్ద లెన్స్ ద్వారా చూస్తున్నట్లు కనిపిస్తుంది. వాస్తవానికి మంచు స్ఫటికాలు చేయబట్టి మిలియన్లలో చిన్న లెన్స్ ఉన్నట్టు. వాతావరణంలో నీరు చిన్న, మంచు స్ఫటికాలుగా గడ్డకట్టవచ్చు. ఈ  స్ఫటికాలు నేలకు రాలుతుండగా, ఈ అలైన్‌మెంట్ సమయంలో, ప్రతి స్ఫటికం ఒక చిన్న లెన్స్ వలె పనిచేస్తుంది, సూర్యకాంతిని మన దృష్టిలోకి వక్రీభవనం (రిఫ్రాక్ట్) చేస్తుంది. సన్ డాగ్లకు సాంకేతిక నామం పరహిలియో.

అయితే, వీడియోలోని ఈ చర్య  హిమాలయాలలోని మణి మహేష్ కైలాశ్ శిఖరంపై సంభవించే మణిదర్శన్ కాదు. పీర్ పింజల్ శ్రేణిలోని శిఖరం, సరస్సు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. నిజానికి ఈ సరస్సు శివుడికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ హిందూ యాత్రా స్థలం. పురాణగాథ ప్రకారం, ఈ శక్తివంతమైన శిఖరం శివుడి నివాసంగా ఉండేది. మణి మహేష్ శిఖరంపై సూర్యోదయాన్ని చూపించే వీడియోను యూట్యూబ్ లో చూడవచ్చు, అక్కడ శివుడి కిరీటంపై సూర్యుడు వజ్రంలా ప్రకాశిస్తూ కనిపిస్తాడు. ప్రతిబింబాన్ని మణి మహేష్ సరస్సులో కూడా చూడవచ్చు, దీనిని మణిదర్శన్ అని పిలుస్తారు.

చివరగా, ఈ వీడియో లో కనిపించేది స్వీడన్ లోని సన్ డాగ్, మణిదర్శన్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll