Fake News, Telugu
 

ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తగ్గించింది కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు అందించే స్కాలర్షిప్‌ మాత్రమే

0

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్స్ కట్ చేసిందన్న వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్  అవుతోంది. ఇంతకుముందు రూ. 60,000 & రూ. 35,000 ఉన్న ఎంబీబీఎస్ మరియు పీజీ విద్యార్థుల స్కాలర్షిప్‌లను రూ. 11,000 & రూ. 10,000కి తగ్గించారని ఈ సోషల్ మీడియా పోస్టులలో క్లెయిమ్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తల్లో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్స్ కట్ చేసింది; ఇంతకుముందు రూ. 60,000 & రూ. 35,000 ఉన్న ఎంబీబీఎస్ మరియు పీజీ విద్యార్థుల స్కాలర్షిప్‌లను రూ. 11,000 & రూ. 10,000కి తగ్గించారు.

ఫాక్ట్(నిజం):  కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించింది ఆ రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖ బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు సంబంధించిన నిర్మాణ కార్మికుల పిల్లలకు అందించే స్కాలర్షిప్స్ మాత్రమే. ఇతర డిపార్టుమెంట్ల ద్వారా ఇతర విద్యార్థులకు అందించే స్కాలర్షిప్‌లు యదావిధిగా కొనసాగుతాయి. ఉదాహారణకి బీసీలు, మైనారిటీలు, మొదలైన వారికి అందిస్తున్న స్కాలర్షిప్‌లలో ఎటువంటి మార్పు లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కార్మిక మంత్రిత్వ శాఖ స్కూల్ విద్యార్థుల నుండి పీజీ/ఎంబీబీఎస్ వరకు అందిస్తున్న స్కాలర్షిప్‌లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం షేర్ అవుతున్న పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టే స్కాలర్షిప్‌లలో భారీ కోత విధించింది.

వార్తా కథనాల ప్రకారం ఇంతకుముందు రూ. 60,000 & రూ. 35,000 ఉన్న ఎంబీబీఎస్ మరియు పీజీ విద్యార్థుల స్కాలర్షిప్‌లను రూ. 11,000 & రూ. 10,000కి తగ్గించారు. కొత్తగా సవరించిన స్కాలర్షిప్‌లను ఈ కథనంలో చూడొచ్చు.

ఐతే ఈ స్కాలర్షిప్‌ల సవరణ అనేది కేవలం కర్ణాటక బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు సంబంధించిన నిర్మాణ కార్మికుల పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది, మిగతా విద్యార్థులకు కాదు. ఇతర డిపార్టుమెంట్ల ద్వారా ఇతర విద్యార్థులకు అందించే స్కాలర్షిప్‌లు యదావిధిగా కొనసాగుతాయి. ఉదాహారణకి బీసీలు, మైనారిటీలు, మొదలైన వారికి అందిస్తున్న స్కాలర్షిప్‌లలో ఎటువంటి మార్పు లేదు (ఇక్కడ & ఇక్కడ).

ఐతే విద్యార్థుల స్కాలర్షిప్‌లలో కోత విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావడంతో కార్మిక శాఖ మంత్రి వివరణ ఇస్తూ బోగస్‌ కార్డులను (స్కాలర్షిప్‌లను) అరికట్టడంతోపాటు, వివిధ శాఖల వారీగా స్కాలర్‌షిప్‌లు ఒకేరకంగా ఉండేలా ఈ సవరణ చేసినట్లు తెలిపారు.

కార్మిక మంత్రి అందించిన వివరణ నేపథ్యంలో సవరించిన నిర్మాణ కార్మికుల పిల్లల స్కాలర్షిప్‌లను కర్ణాటకలో బీసీలకు అందిస్తున్న ప్రీమెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌లతో పోలుస్తూ అందించిన సమాచారం కింది టేబుల్‌లో చూడొచ్చు (ఇక్కడ).

చివరగా, ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తగ్గించింది కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా నిర్మాణ కార్మికుల పిల్లలకు అందించే స్కాలర్షిప్‌ మాత్రమే.

Share.

About Author

Comments are closed.

scroll