Fake News, Telugu
 

సంబంధంలేని వీడియోని చలాన్ రాసినందుకు బరేలీ పోలీస్‌ని ముస్లింలు చితకబాదుతున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

బరేలీ నగరంలో ఒక పోలీస్ చలాన్ రాసినందుకు అతన్ని ముస్లింలు చితకబాదుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బరేలీ నగరంలో ఒక పోలీస్ చలాన్ రాసినందుకు ముస్లింలు అతన్ని చితకబాదుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన రాజస్తాన్ రాష్ట్రంలోని భరత్‌పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. హర్యానా పోలీసులు ఒక కేసుకి సంబంధించి భరత్‌పుర్ జిల్లాలోని జురెహ్ర పట్టణంలో ప్రయాణిస్తుండగా, వారి వాహనం మరో వాహనాన్ని ఢికొంది. పోలీసు వాహనం ఢీకొన్న మరో వాహనంలోని యువకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగి ఒక కానిస్టేబుల్‌పై ఇలా దాడి చేసారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన యువకులు ముస్లింలని పోలీసులు ఎక్కడా ప్రకటించలేదు. ఈ వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి నగరానికి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్‌షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Dainik Bhaskar’ న్యూస్ వెబ్సైటు మార్చ్ 2021లో పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. వీడియోలోని ఘటన రాజస్తాన్ రాష్ట్రంలోని భరత్‌పుర్ జిల్లాలో చోటుచేసుకుందని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. హర్యానా పోలీసులు ఒక కేసు విచారణ కోసం భరత్‌పుర్ జిల్లాలోని జురెహ్ర పట్టణంలో ప్రయాణిస్తుండగా, వారి వాహనం మరో వాహనాన్ని ఢీకొన్నట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. పోలీసు వాహనం ఢీకొన్న మరో వాహనంలోని యువకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగి ఒక కానిస్టేబుల్‌పై ఇలా దాడి చేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

రాజస్తాన్ రాష్ట్రం భరత్‌పుర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ అర్టికల్స్‌ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  ఈ ఘటనకు సంబంధించి భరత్‌పుర్ జిల్లా పోలీసులు ట్వీట్‌ కూడా పెట్టారు. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన యువకులు ముస్లింలని భరత్‌పుర్ పోలీసులు ఎక్కడా ప్రకటించలేదు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో రాజస్తాన్ రాష్టానికి సంబంధించిందని, ఉత్తరప్రదేశ్ బరేలి నగరంలో చోటుచేసుకున్న ఘటన కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, రాజస్తాన్ రాష్ట్రానికి సంబంధించిన వీడియోని చలాన్ రాసినందుకు బరేలీ పోలీస్‌ని ముస్లింలు చితకబాదుతున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll