Fake News, Telugu
 

స్క్రిప్టెడ్ వీడియోని 52 ఏళ్ల బామ్మతో 21 ఏళ్ల కుర్రాడు ప్రేమ పెళ్లి చేసుకున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

52 ఏళ్ల బామ్మతో 21 ఏళ్ల కుర్రాడు ప్రేమ పెళ్లి“, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 52 ఏళ్ల బామ్మతో 21 ఏళ్ల కుర్రాడు ప్రేమ పెళ్లి చేసుకున్న దృశ్యాలు.

ఫాక్ట్: పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ‘techprakash’ అనే ఇంస్టాగ్రామ్ పేజీ పెళ్లిలకు సంబంధించి ఇలాంటి మరెన్నో స్క్రిప్టెడ్ వీడియోలను పబ్లిష్ చేసింది. ఈ వీడియోలో జంటగా కనిపిస్తున్న వ్యక్తులు మరికొన్ని స్క్రిప్టెడ్ వీడియోలలో వేరే వ్యక్తులకు జంటలాగా కూడా నటించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘All in one NEWs’ అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ఇటీవల పోస్ట్ చేసినట్టు తెలిసింది. 21 ఏళ్ల కుర్రాడు 52 ఏళ్ల బామ్మతో ప్రేమలో పడి ఆమెని పెళ్లి చేసుకున్న దృశ్యాలని తెలుపుతూ, ఈ వీడియో క్రెడిట్స్ ‘techprakash’ అనే సోషల్ మీడియా పేజీకి ఇచ్చారు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియో ‘@techprakash’ అనే ఇంస్టాగ్రామ్ పేజీలో దొరికింది. వివాహాలకు సంబంధించిన అనేక స్క్రిప్టెడ్ వీడియోలను ఈ ఇంస్టాగ్రామ్ పేజీ పబ్లిష్ చేసింది.  

పోస్టులో షేర్ చేసిన వీడియోలో జంటగా కనిపించిన వ్యక్తులు, ‘@techprakash’ ఇంస్టాగ్రామ్ పేజీ పబ్లిష్ చేసిన మరికొన్ని వీడియోలలో వేరే వ్యక్తులకు జంటలాగా కూడా నటించారు. దీనిబట్టి, పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, స్క్రిప్టెడ్ వీడియోని 52 ఏళ్ల బామ్మతో 21 ఏళ్ల కుర్రాడు ప్రేమ పెళ్లి చేసుకున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll