Fake News, Telugu
 

కడప లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అని Way2News, ABN న్యూస్ ప్రచురించలేదు

0

“కడప లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నాడుఅని అక్కడి టిడీపీ అభ్యర్థి సి. భూపేష్ రెడ్డి ఫ్రెండ్లీ పోటీలో నిలుస్తాడాని పేర్కొన్నారు” అంటూ Way2News కథనం, ABN తెలుగు న్యూస్ చానెల్ హెడ్లైన్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). దీని వెనుక ఎంత వాస్తవం ఉందో చూద్దాం.

ఆర్కైవ్ పోస్టును ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కడపలో లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నాడు అంటూ Way2News, ABN తెలుగు న్యూస్ చానెల్ ప్రచురించాయి.

ఫాక్ట్: వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ ద్వారా ‘Way2News’లో వెతికితే ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ హెచ్చరిక’ అనే శీర్షికతో ప్రచురించిన అసలైన కథనం దొరికింది. వైరల్ పోస్టులోని ఫోటో, Y.S.షర్మిల తన కుమారుడి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించినప్పటిది. తాము ఇటువంటి వార్తను ప్రసారం చేయలేదని, ఇది ఫేక్ న్యూస్ క్లిప్ అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 7 ఏప్రిల్ 2024 నాడు స్పష్టం చేసింది. అంతే కాకుండా, ఈ వార్త ఫేక్ అని తెదేపా తన అధికారిక x అకౌంటు ద్వారా తెలిపింది. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో తెలిపినట్టుగా, చంద్రబాబు నాయుడు కడపలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీ శ్రేణులకు లేఖను విడుదల చేశారా? అని తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, దీనికి సంబంధించి ఎటువంటి న్యూస్ రేపోర్ట్స్ మాకు దొరకలేదు. పైగా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది.

వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ ద్వారా ‘Way2News’లో వెతికితే ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ హెచ్చరిక’ అనే శీర్షికతో ప్రచురించిన అసలైన కథనం దొరికింది. వైరల్ పోస్టులోని ఫోటో, Y.S.షర్మిల తన కుమారుడి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించినప్పటిది అని తెలుసుకున్నాం (క్క మరియు ఇక్కడ). దీని ద్వారా ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేశారు అని నిర్థారించవచ్చు.

దీని గురించి మరింత వెతికితే, తాము ఇటువంటి వార్తను ప్రసారం చేయలేదని, ఇది ఫేక్ న్యూస్ క్లిప్ అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 7 ఏప్రిల్ 2024 నాడు స్పష్టం చేసింది (ఇక్కడ మరియు ఇక్కడ). అంతే కాకుండా, కడప లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు తెలుగు దేశం మద్దతు అనే వార్త ఫేక్ అని తెదేపా అధికారిక x అకౌంటులో ట్వీట్ (ఆర్కైవ్) చెయ్యటం గమనించాం.

చివరిగా, కడపలో లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు అని Way2News మరియు ABN న్యూస్ ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll