Fake News, Telugu
 

గీర్ట్ విల్డర్స్ నెథర్లాండ్స్ ప్రధాన మంత్రి కాదు, ఆయన పాత ప్రసంగం తను ఇటీవల చేసిన ప్రసంగం అని తప్పుగా షేర్ చేస్తున్నారు .

0

నెదర్లాండ్స్ పార్టీ ఫర్ ఫ్రీడం లేదా ఫ్రీడమ్ పార్టీ (పీవీవీ) నాయకుడు గీర్ట్ విల్డర్స్ ముస్లింలను హెచ్చరిస్తూ, “మా చట్టాల కంటే.. తమ గ్రంథమే ఉన్నతమైంది అని భావించే ముస్లింలు.. తక్షణమే దేశం విడిచి వెళ్ళాలి..” అని అంటూ ప్రసంగం చేస్తున్న ఒక వీడియో అని సోషల్ మీడియాలో ఒక క్లిప్ షేర్ అవుతోంది. గీర్ట్ విల్డర్స్ నెదర్లాండ్స్ ప్రధాన మంత్రి అని ఈ వీడియోలో క్రెడిట్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ యొక్క  నిజానిజాలు తెలుసుకొందాం.

క్లెయిమ్: నెదర్లాండ్స్ ప్రధాన మంత్రి  గీర్ట్ విల్డర్స్ తన ప్రసంగంలో ముస్లింలను హెచ్చరించారు.

ఫ్యాక్ట్ (నిజం): ఇది నవంబర్ 2020 నాటి పాత వీడియో. నెదర్లాండ్స్ జనరల్ ఎలక్షన్ 2023లో గీర్ట్ విల్డర్స్ రాజకీయ పార్టీ, పార్టీ ఫర్ ఫ్రీడం లేదా ఫ్రీడమ్ పార్టీ (PVV) గెలిచింది, అయితే అతని పార్టీ కేవలం 24% అంటే 37 సీట్లు మాత్రమే గెలుచుకున్నందున అతని పార్టీ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, తను  ప్రధానమంత్రిగా ఇంకా ఎన్నిక కాలేదు. 150 సీట్ల డచ్ పార్లమెంట్‌లో సీట్లు మరియు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీల మద్దతు అవసరం. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.

ఈ క్లెయిమ్ యొక్క నిజానిజాల్ని వెరిఫై చేయటానికి మొదటగా, ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా గీర్ట్ వైల్డర్స్ నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడలేదని వెల్లడైంది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). అతని పార్టీ PVV సార్వత్రిక ఎన్నికలలో గెలిచినప్పటికీ, నెదర్లాండ్స్ పార్లమెంటులో కేవలం 24% సీట్లు మాత్రమే గెలుచుకున్నందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీల నుండి మద్దతు పొందవలసి ఉంది.

పార్లమెంటులోని మొత్తం 150 సీట్లలో ఆయన పార్టీ పీవీవీ 37 సీట్లు గెలుచుకుంది. నెదర్లాండ్స్ పార్లమెంటులోని మెజారిటీ రావాలి అంటే వారికి కనీసం 76 సీట్లు ఉండాలి, దీని అర్థం PVV పార్టీకి వేరే పార్టీల వారి మద్దతు అవసరం ఉంది. 5 ఫిబ్రవరి 2024 నాటికి గీర్ట్ వైల్డర్స్ నెథర్లాండ్స్ ప్రధాని కాదు

వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, మేము దాని కీఫ్రేమ్‌లలో కొన్నింటిపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా వైరల్ వీడియో యొక్క అసలైన వెర్షన్‌ అయిన డచ్ పార్లమెంట్‌లో గీర్ట్ విల్డర్స్ చేసిన ప్రసంగం మాకు దొరికింది. ‘PVVpers’ అనే YouTube ఛానెల్‌లో అందుబాటులో ఉన్న ఈ వీడియో 12 నవంబర్ 2020న “గీర్ట్ విల్డర్స్ యొక్క టెర్రర్ డిబేట్ నుండి ఇన్‌పుట్ (12-11-2020)” (డచ్‌లో నుండి తెలుగులోకి అనువదించగా) అనే శీర్షికతో అప్‌లోడ్ చేయబడింది.

వైరల్ వీడియో ఈ 16:44 సెకన్ల వీడియో నుండి క్లిప్ చేయబడింది, వైరల్ అవుతున్న భాగాన్ని 2:50 నుండి చూడవచ్చు. YouTubeలో ఉన్న ఆటో-జెనెరేటెడ్ ఉపశీర్షికల ద్వారా ఈ వీడియోలో గీర్ట్ విల్డర్స్ 2020లో జరిగిన ఫ్రెంచ్ ఉపాధ్యాయుడు శామ్యూల్ పాటీ హత్య గురించి మాట్లాడుతున్నారు మేము అర్థం చేసుకున్నాము. తర్వాత ఇదే ప్రసంగంలో, అతను ముస్లింలు మరియు ఇస్లాం గురించి మాట్లాడారు. ఇంకా వైరల్ వీడియోలో కూడా కనిపించే కొన్ని ప్రతిపాదనలు చేశారు.

తదుపరి శోధనలో ఈ ప్రసంగం యొక్క అనువాదాన్ని నవంబర్ 2020లో అమీ మెక్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఎక్స్‌లో(X) అప్‌లోడ్ చేశారని తేలింది, ఈ వీడియోనే ఇప్పుడు వైరల్‌గా మారిన వీడియో అని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరిగా, నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా గీర్ట్ విల్డర్స్ ఇంకా ఎన్నిక కాలేదు. ఈ వీడియో 22 నవంబర్ 2023 ఎన్నికల తర్వాత అతని ప్రసంగం కాదు, నవంబర్ 2020 నాటిది..

Share.

About Author

Comments are closed.

scroll