భారతదేశంలో 5,79,092 మంది వీఐపీలు ఉన్నారని, వారికి ఉచిత భద్రత, విమాన ప్రయాణం, విద్యుత్, నీరు మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తున్నారు. పోస్ట్‌లో చెప్పిన దాంట్లో నిజానిజాలు ఏంటో చూద్దాం.
క్లెయిమ్ : భారతదేశంలో 5,79,092 వీఐపీలు ఉన్నారు.
ఫాక్ట్ (నిజం ): భారతదేశంలో వీఐపీల సంఖ్యకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కేంద్ర హోం శాఖ వారు ఒక ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో, ‘వీఐపీ’ అనే పదం అధికారిక నామకరణంలో భాగం కాదు. భద్రతా కవరేజీని అందించడం కోసం ఒక వ్యక్తిని, ‘వీఐపీ’ లేదా నాన్-వీఐపీగా వర్గీకరించే అధికారిక ప్రక్రియ ఏమి లేదు అని పేర్కొన్నారు.”బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్” ప్రచురించిన నివేదిక ప్రకారం, “2019లో మొత్తం 19,467 మంది ప్రొటెక్టెడ్ పర్‌సన్స్‌కి (పీపీలు) (మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్‌లు మొదలైనవి) 6 నెలలకు పైగా పోలీసు రక్షణ కల్పించారు.” కావున, పోస్ట్‌లో చెప్తున్నది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
భారతదేశంలోని వీఐపీల సంఖ్యకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా, ఎటువంటి అధికారిక గణాంకాలు లభించలేదు. అయితే, జూలై 2014లో ‘కేంద్ర హోం శాఖ’ ఒక RTIకి ఇచ్చిన రిప్లైలో, ‘వీఐపీ’ అనే పదం అధికారిక నామకరణంలో భాగం కాదు అని, భద్రతా కవరేజీని అందించడం కోసం ఒక వ్యక్తిని ‘వీఐపీ’ లేదా నాన్-వీఐపీగా వర్గీకరించే అటువంటి అధికారిక ప్రక్రియ ఏమి లేదు” అని తెలిపింది.
అదేవిధంగా, “దేశంలో వీఐపీ హోదాకు అనుగుణంగా ప్రభుత్వం ఆమోదించిన నిబంధనల వివరాలు మరియు ప్రస్తుతం వీఐపీ కేటగిరీలో చేర్చబడిన వ్యక్తుల పేర్ల గురించి” అడిగినప్పుడు, అప్పటి హోం వ్యవహారాల సహాయ మంత్రి లోక్‌సభలో – “ VVIP లేదా VIP అనే హోదా ఏదైనా ఒక వ్యక్తికి ఆపాదించబడిన అధికారిక నామకరణం కాదు” అని సమాధానమిచ్చారు
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బిపిఆర్‌డి) ప్రచురించిన నివేదిక ప్రకారం, “2019 సంవత్సరంలో 6 నెలలకు పైగా దేశంలో మొత్తం 19,467 మంది రక్షిత వ్యక్తులకు (పిపిలు) (మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్‌లు మొదలైనవారు) పోలీసు రక్షణను అందించారు. ఇది 2018లో భద్రతను అందించిన 21,300 (సవరించిన) PPలతో పోల్చితే తగ్గింది”. కాబట్టి, పోస్ట్‌లో క్లెయిమ్ చేసిన వీఐపీల సంఖ్యకంటే పోలీసు వారు రక్షణ కల్పించిన వారి సంఖ్య తక్కువే.
చివరిగా, భారతదేశంలో వీఐపీల సంఖ్యకు సంబంధించి ఎటువంటి అధికార జాబితా లేదు