Fake News, Telugu
 

డీ.కే.శివకుమార్ చేసిన మేకేదాటు పాదయాత్రకు సంబంధించిన వీడియోను ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

Update (30 October 2023):

తెలంగాణలోని తాండూర్ ప్రచారంలో డీ.కే. శివకుమార్‌ తాగి నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. అయితే క్రింద వివరించినట్టు, ఈ వీడియో 2022లో కావేరి నదిపై మేకేదాటు ప్రాజెక్ట్‌ను త్వరగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ డీ.కే.శివకుమార్ నిర్వహించిన పాదయాత్రకు సంబంధించింది. ఈ వీడియోతో ప్రస్తుత 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తాండూరులో డీ.కే. శివకుమార్‌ పాల్గొన్న సభకు ఎటువంటి సంబంధంలేదు.

Published (01 May 2023):

కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి డీ.కే.శివకుమార్ ఫుల్లుగా తాగి ప్రచారానికొచ్చి ఊగుతూ పడబోయాడు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో అన్ని పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ వీడియో ప్రస్తుత ప్రచారానికి సంబంధించినదంటూ షేర్ అవుతోంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటక ఎన్నికల సందర్భంగా డీ.కే.శివకుమార్ ఫుల్లుగా తాగి ప్రచారానికి వచ్చిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2022లో కావేరి నదిపై మేకేదాటు ప్రాజెక్ట్‌ను త్వరగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ డీ.కే.శివకుమార్ నిర్వహించిన పాదయాత్రకు సంబంధించింది. ఈ వీడియోతో ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కర్ణాటక రాష్ట్రంలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే అన్నీ ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు.

ఐతే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత డీ.కే.శివకుమార్ ఊగుతూ నడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రచారానికి సంబంధించింది అంటూ షేర్ అవుతోంది. కానీ, ఈ వీడియో ఇప్పటిదికాదు. 2022 జనవరిలో కావేరి నదిపై మేకేదాటు ప్రాజెక్ట్‌ను త్వరగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత శివ కుమార్ చేసిన పాదయాత్రకు సంబంధించింది.

వైరల్ వీడియోలో ఉన్న న్యూస్ ఛానల్ లోగో ఆధారంగా యూట్యూబ్‌లో ఈ వీడియో కోసం వెతకగా, ఈ వీడియో ‘News First Kannada’ అనే ఛానల్‌లో 09 జనవరి 2022న అప్లోడ్ చేసినట్టు తెలిసింది. ‘DK Shivakumar: DK Shivakumar who was tired Mekedatu Padayatre’ అనే టైటిల్‌తో ఈ వీడియోను అప్లోడ్ చేసారు.

శివ కుమార్ నిర్వహించిన ఈ పాదయాత్రకు సంబంధించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే పాదయాత్ర సమయంలో శివకుమార్ తాగి నడిచాడంటూ అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయింది.

ఐతే ఈ ఘటనపై పెద్దగా వార్తా కథనాలైతే ఏమి లేవు. కానీ ఈ వివరాల బట్టి ఈ వీడియో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించింది కాదన్న విషయం మాత్రం స్పష్టమవుతుంది. అలాగే ఈ వీడియోను ఇప్పుడు సందర్భరహితంగా షేర్ చేస్తున్నట్టు అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, 2022లో డీ.కే.శివకుమార్ చేసిన మేకేదాటు పాదయాత్రకు సంబంధించిన వీడియోను ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll