Fake News, Telugu
 

హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, అన్ని రాష్ట్రాలు హజ్ వాలంటీర్లను ఆన్-డ్యూటీగా పరిగణిస్తూ పూర్తి వేతనం ఇస్తున్నాయి

0

“హజ్ యాత్రకు వాలంటీర్ గా వెళ్లిన వారిని ఆన్-డ్యూటీగా పరిగణించి, 45 రోజుల వేతనం మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హజ్ యాత్రకు వాలంటీర్లుగా వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆన్-డ్యూటీగా పరిగణించి, 45 రోజుల వేతనం మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.

ఫాక్ట్(నిజం): హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, తెలంగాణ మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలు హజ్ వాలంటీర్లను ఆన్-డ్యూటీగా పరిగణిస్తూ పూర్తి వేతనం ఇస్తున్నాయి.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ క్లెయిమ్ గురించి సమాచారం కోసం ముందుగా, తెలంగాణ రాష్ట్ర హాజ్ కమిటీ యొక్క అధికారిక వెబ్సైటును పరశీలించగా,  హాజ్ 2024కు సంబంధించిన అనేక సర్కులర్స్ కనిపించాయి, వీటిని పరశీలించంగా హజ్ వాలంటీర్లను (ఖాదిమ్-ఉల్-హుజ్జాజ్) (KuH) హజ్ అని పిలుస్తారని తెలిసింది. హజ్ యాత్ర యొక్క వివిధ దశలలో హజ్ యాత్రికులకు సహాయం అందించడానికి  వీరిని నియమిస్తారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoMA) ద్వారా ఆమోదించబడిన హజ్ కమిటీ ఆఫ్ ఇండియా (HCol) నిబంధనల ప్రకారం, అన్ని రాష్ట్రాలు/U.Tల నుండి హజ్ వాలంటీర్లను ఎంపిక చేసి నియమిస్తారు. 300 మంది యాత్రికులకు ఒక హజ్ వాలంటీర్ ఉంటారు. మహిళా అభ్యర్థులు కూడా ఖాదిమ్-ఉల్-హుజ్జాజ్‌(హజ్ వాలంటీర్లుగా) దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారి ఎంపిక రాష్ట్రంలోని మెహ్రామ్ దరఖాస్తుదారులు లేని మహిళల సంఖ్యకు అనుగుణంగా ఉంటుంది, హజ్ వాలంటీర్లు కోసం చేసిన ఖర్చులో 50% HCol ( హాజ్ కమిటీ అఫ్ ఇండియా) మరియు మిగిలిన 50% సంబంధిత రాష్ట్ర/UT హజ్ కమిటీలు (SHCలు)( స్టేట్ హజ్ కమిటీలు) భరిస్తాయి.

రాష్ట్ర హజ్ కమిటీలు హజ్ వాలంటీర్లును ఎంపిక చేయడానికి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం, కేవలం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన ముస్లిం ఉద్యోగులు మాత్రమే హజ్ వాలంటీర్లుగా ఎంపిక చేయబడుతారు. వీరు హజ్ వాలంటీర్లుగా పని చేసిన కాలం మొత్తం ఆన్-డ్యూటీగా పరిగణిస్తారు మరియు వారికి పూర్తి వేతనం ఇస్తారు.

అనేక రాష్ట్రాల హాజ్ కమిటీ యొక్క అధికారిక వెబ్సైటులు పరిశీలించిన కూడా ఇదే విషయం మనకు స్పష్టమవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

తదుపరి మేము వైరల్ క్లెయిమ్ గురించి మరింత సమాచారం కోసం తెలంగాణ స్టేట్ హాజ్ కమిటీ మరియు తెలంగాణ హజ్ కమిటీ తరుపున హజ్ 2024 యాత్రలో వాలంటీర్‌గా పని చేసిన వారిని సంప్రదించగా, వారు కూడా హజ్ వాలంటీర్లును ఎంపిక చేయడానికి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు ఉన్నాయని వాటి అనుగుణంగానే అన్ని రాష్ట్ర హాజ్ కమిటీలు హాజ్ వాలంటీర్లును ఎంపిక చేస్తారని, వాలంటీర్లును హజ్‌లో సేవ చేసిన కాలాన్ని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం అన-డ్యూటీగానే పరిగణిస్తారని, పూర్తి వేతనం చెల్లిస్తారని తెలియజేసారు. అలాగే,  హజ్‌లో సేవ చేసినందుకు ప్రతి వాలంటీర్ 2100 సౌదీ రియల్ పొందుతారని తెలిపారు. దీన్ని బట్టి కేవలం తెలంగాణ మాత్రమే కాదు అన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్ర హాజ్ కమిటీల తరపున హాజ్ వాలంటీర్లుగా పనిచేసిన వారిని ఆన్-డ్యూటీగా పరిగణిస్తూ పూర్తి వేతనం ఇస్తున్నాయిని మనం నిర్థారించవచ్చు.

ఈ విషయంపై మరింత సమాచారం కోసం మేము హజ్ కమిటీ అఫ్ ఇండియా అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వారిని సంప్రదించడం జరిగింది వారి నుండి స్పందన రాగానే ఈ ఆర్టికల్ అప్డేట్ చేస్తాము.

చివరగా, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, అన్ని రాష్ట్రాలు హజ్ వాలంటీర్లను ఆన్-డ్యూటీగా పరిగణిస్తూ పూర్తి వేతనం ఇస్తున్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll