ఇతర దేశాలలో భారతీయ సనాతన సంస్కృతి ప్రకారం అరిటాకులో భోజనం చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. విదేశాలలో సనాతన సంస్కృతిని అంతగా గౌరవిస్తుంటే, మన సొంత సంస్కృతిని మనం అనుసరించకపోవడం బాధాకరం అని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇతర దేశాలలో భారతీయ సనాతన సంస్కృతి ప్రకారం విదేశీయులు భోజనం చేస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ‘US Consulate Chennai’ ఆఫీసు అధికారులు 2016లో తమ కుటుంబాలతో కలిసి చెన్నై లోని కాశివినాయగ మెస్‌లో భోజనం చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. ‘US Consulate Chennai’ ఉద్యోగులు ‘Happy Madras Week 2016’ అనే ఈవెంట్ లో భాగంగా ఇలా చెన్నైలోని ఒక మెస్‌లో తమిళ భోజనం చేసారు. ఈ వీడియో విదేశాలలో తీసినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియో ‘US Consulate General Chennai’ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో దొరికింది. ఈ వీడియోని ‘US Consulate General Chennai’ 19 ఆగష్టు 2016 నాడు తమ యూట్యూబ్ చానెల్లో పబ్లిష్ చేసారు. ‘US Consulate Chennai’ అధికారులు ‘Happy Madras Week’ వీడియో సిరీస్ లో భాగంగా చెన్నై లోని కాశివినాయగ మెస్‌లో అరిటాకులో భోజనం చేసినట్టు ఈ వీడియో వివరణలో తెలిపారు. ‘US Consulate Chennai’ ఈ వీడియోని తమ అధికారిక ట్విట్టర్ మరియు ఫేస్బుక్ పేజిలలో కూడా పబ్లిష్ చేసింది.
‘US Consulate Chennai’ అధికారులు తమ కుటుంబాలతో కలిసి కాశివినాయగ మెస్‌లో భోజనం చేసిన విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ‘The Indian Express’ 24 ఆగష్టు 2016 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
‘Happy Madras Week 2016’ ఈవెంట్ లో భాగంగా మద్రాస్ నగరంలో పాటించే సంస్కృతి, లభించే భోజనం, అక్కడి జీవన విధానం గురించి వివరిస్తూ ‘US Consulate Chennai’ ఒక వీడియో సిరీస్ చేసింది. ఆ వీడియోలని ‘US Consulate Chennai’ ఫేస్బుక్ పేజిలో చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో చెన్నై నగరంలో తీసినదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, ‘US Consulate Chennai’ అధికారులు చెన్నై మెస్‌లో భోజనం చేస్తున్న వీడియోని చూపిస్తూ విదేశాలలో సనాతన సంస్కృతిని పాటిస్తున్న దృశ్యాలని చేస్తున్నారు.