Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఫోటోని, రాముడు-సీత-లక్ష్మణుడు-హనుమంతుడి ఆకారాలతో ఉన్న మామిడికాయ అని షేర్ చేస్తున్నారు

0

రాముడు-సీత-లక్ష్మణుడు-హనుమంతుడి ఆకారాలతో కూడిన మామిడికాయ వరంగల్ జిల్లాలో పూసిందని చెప్తూ, ఒక ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాముడు-సీత-లక్ష్మణుడు-హనుమంతుడి ఆకారాలతో వరంగల్ జిల్లాలో పూసిన మామిడికాయ ఫోటో.

ఫాక్ట్: పోస్ట్ లోని మామిడికాయ ఫోటో ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ ఫోటోలో మామిడికాయ మీద రాముడు-సీత-లక్ష్మణుడు-హనుమంతుడి ఆకారాలు లేవు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన మామిడికాయ గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అలాంటి మామిడికాయ గురించి ఎక్కడా ఎటువంటి సమాచారం దొరకలేదు. సాధారణంగా ఇలాంటి వింతలు జరిగితే వార్తాసంస్థలు వాటి గురించి ప్రచురిస్తాయి; కానీ ఫోటోలోని మామిడికాయ గురించి ఎలాంటి సమాచారం లేదు. పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, రాముడు-సీత-లక్ష్మణుడు-హనుమంతుడి ఆకారాలతో లేని అదే మామిడికాయ ఫోటో ఇంటర్నెట్ లో చాలా మంది పోస్ట్ చేసినట్టు తెలిసింది. కొన్ని పోస్టులను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

అంతేకాదు, కీ-వర్డ్స్ తో గూగుల్ లో వెతకగా, పోస్ట్ చేసిన ఫోటోలో మామిడికాయ మీద కనపడుతున్న రాముడు-సీత-లక్ష్మణుడు-హనుమంతుడు లాంటి చాలా ఫోటోలు వస్తాయి. అలాంటి ఒక ఫోటో ఉపయోగించి మామిడికాయ మీద వారి ఆకారాలు కనపడేలా ఎడిట్ చేసి ఉంటారు.

చివరగా, ఎడిట్ చేసిన ఫోటో పెట్టి, రాముడు-సీత-లక్ష్మణుడు-హనుమంతుడి ఆకారాలతో ఉన్న మామిడికాయ అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll