Fake News, Telugu
 

హిమాచాల్ ప్రదేశ్‌లోని ఖాబ్ సంఘం బ్రిడ్జి దృశ్యాలని రిషికేశ్-కేదార్‌నాథ్‌ మధ్య నిర్మించిన కొత్త రహదారి అంటూ షేర్ చేస్తున్నారు

0

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిషికేశ్ నుంచి కేదార్‌నాథ్‌ మధ్య నూతనంగా నిర్మించిన రహదారి దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిషికేశ్ నుంచి కేదార్‌నాథ్‌ మధ్య నూతనంగా నిర్మించిన రహదారి దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కిన్నౌర్ జిల్లాలోని ఖాబ్ సంఘం వంతెన దగ్గరలో ఉన్న రోడ్డు దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నది రిషికేశ్-కేదార్‌నాథ్‌ మధ్య నిర్మించిన రహదారి దృశ్యాలు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన విడియోని జాగ్రత్తగా గమనిస్తే, 0:30 నిమిషాల దగ్గర వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి, తాము ఖాజా వెళ్తున్న దారిలో కనిపించిన అద్భుత దృశ్యాలని పేర్కొనడం మనం చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం వెతికితే, ఇవే దృశ్యాలతో పోలి ఉన్న వీడియోని ఒక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కాజా సమీపంలోని స్పీటి వ్యాలీకి వెళ్తుండగా కనిపించే అందమైన రోడ్లు మరియు పర్వతాల దృశ్యాలని ఈ వీడియోని షేర్ చేస్తూ ఆ ఇన్‌స్టాగ్రామ్‌ యూసర్ తెలిపారు.

ఇదివరకు, పోస్టులో షేర్ చేసిన వీడియోని అదే క్లెయింతో కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, కొందరు ఫేస్‌బుక్ యూసర్లు ఈ వీడియోలో కనిపిస్తున్నది రిషికేశ్-కేదార్‌నాథ్‌ మధ్య ఉన్న రహదారి కాదని, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఖాబ్ సంఘం వంతెన దగ్గర నిర్మించిన రహదారి దృశ్యాలని స్పంధించారు. పై వివరాల ఆధారంగా వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, హిమాచాల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లా నుండి కాజాకు వెళ్తుండగా కీన్నౌర్ జిల్లాలోని ఖాబ్ సంఘం వంతెన దగ్గరలో ఉన్న అద్భుత రహదారి దృశ్యాలంటూ చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలను పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

కాజా మార్గంలో ఖాబ్ సంఘం బ్రిడ్జ్ దగ్గర నిర్మించిన రహదారి దృశ్యాలని గూగుల్ మాప్స్ లో కూడా చూడవచ్చు. రిషికేశ్-కేదార్‌నాథ్‌ మధ్య ఉన్న రహదారి దృశ్యాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నది రిషికేశ్-కేదార్‌నాథ్‌ మధ్య నిర్మించిన రహదారి దృశ్యాలు కావని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, హిమాచాల్ ప్రదేశ్‌లోని ఖాబ్ సంఘం బ్రిడ్జ్ దగ్గర ఉన్న రహదారి దృశ్యాలని రిషికేశ్-కేదార్‌నాథ్‌ మధ్య నిర్మించిన కొత్త రహదారి దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll