Fake News, Telugu
 

వైరల్ న్యూస్ క్లిప్పింగ్ 2023 నాటిది; దీనిని సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఏ వార్తా సంస్థ పబ్లిష్ చేయలేదు

0

ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ పోస్ట్ ప్రకారం, ‘రాహుల్ భారతదేశం నుండి వచ్చారా లేక పాకిస్తాన్ నుంచా?’ అనే శీర్షికతో ఒక ఆంగ్ల న్యూస్ పేపర్ క్లిప్పింగ్ షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్ వెనుక ఉన్న నిజం ఏమిటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

వీడియో యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘రాహుల్ భారతదేశం నుండి వచ్చారా లేక పాకిస్తాన్ నుంచా’ అనే శీర్షికతో ఒక సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన సంస్థ ఒక కథనం పబ్లిష్ చేసింది.

ఫాక్ట్(నిజం): వైరల్ న్యూస్ క్లిప్పింగ్ ఇటీవలది కాదు; ఇది 2023 నాటిది. ఈ క్లిప్పింగ్ వాస్తవంగా హిందీలో పబ్లిష్ అవగా దాని హిందీలో నుండి ఇంగ్లీష్‌కు డిజిటల్‌గా అనువదించి షేర్ చేస్తున్నారు. దీనిని సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఏ వార్తా సంస్థ పబ్లిష్ చేసినట్టు ఆధారాలు లభించలేదు. హిందీ న్యూస్ ఆర్టికల్ యొక్క సోర్స్, రచయితను కనుగొనలేకపోయాము. కాబట్టి, పోస్ట్‌లో చేసిన దావా తప్పు.

మేము వైరల్ న్యూస్ క్లిప్పింగ్ శీర్షికతో సరిపోయే న్యూస్ రిపోర్టుల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేసాము, కానీ మాకు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఈ వైరల్ న్యూస్ క్లిప్పింగ్ ను మనం జాగ్రత్తగా గమనిస్తే, దీంట్లో ఉపయోగించిన ఫాంట్ అసమానంగా ఉండటం మనం గమనించవచ్చు. అలాగే, ఇది గూగుల్ ఇమేజ్ ఇన్‌స్టెంట్ కెమెరా ట్రాన్స్లేషన్ ఫీచర్ ఉపయోగించి అనువాదం చేసినట్లు తెలుస్తుంది. 

వైరల్ పోస్ట్‌ను గూగుల్ లెన్స్‌తో సెర్చ్ చేసినప్పుడు, మాకు ఒక సోషల్ మీడియా పోస్ట్ దొరికింది. ఈ పోస్ట్ 05 జూన్ 2023న పోస్ట్ చేయబడింది. యూజర్ వైరల్ న్యూస్ క్లిప్పింగ్ ఆంగ్ల శీర్షికతో మ్యాచ్ అయ్యే హిందీ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసారు: ‘రాహుల్ భారతదేశానికి చెందినవాడా   లేదా పాకిస్తాన్‌కి చెందినవాడా అని అమెరికన్లు అడుగుతున్నారు??? ప్రశ్న సరైనదే..’

వైరల్ ఇమేజ్‌లో కనిపించే ఆంగ్ల క్లిప్పింగ్ తో పోలిస్తే, హిందీ క్లిప్పింగ్ లో ఎలాంటి తప్పులు లేదా ఫాంట్ అసమానతలు లేవు, ఇది అసలు (మూలం) క్లిప్పింగ్ అని తెలిసింది. 

ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ క్లిప్పింగ్ అసలు హిందీలో రాయబడింది అని, సాన్ ఫ్రాన్సిస్కోకు ఆధారితమైన సంస్థ ఏదీ దీన్ని పబ్లిష్ చేయలేదు అని స్పష్టం అయింది. అయితే, హిందీ న్యూస్ క్లిప్పింగ్ యొక్క మూలం, రచయితను కనుగొనలేకపోయాము.

చివరిగా, వైరల్ న్యూస్ క్లిప్పింగ్ ఇటీవలది కాదు; ఇది 2023 నాటిది. ఈ క్లిప్పింగ్ వాస్తవంగా హిందీలో పబ్లిష్ అవగా, హిందీలో నుండి ఇంగ్లీష్‌కు డిజిటల్‌గా అనువదించి షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll