Fake News, Telugu
 

అమెరికాకు సంబంధించిన హెలికాప్టర్లని చూపిస్తూ భారత్ పాంగోంగ్ సరస్సు పై గస్తీ నిర్వహిస్తోంది అంటూ షేర్ చేస్తున్నారు

0

చైనా కుట్రలను భగ్నం చేయడానికి భారత అపాచీ హెలికాప్టర్లు పాంగోంగ్ సరస్సులో గస్తీ నిర్వహిస్తున్నాయి అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాంగోంగ్ సరస్సు పై భారత సైన్యం అపాచీ హెలికాప్టర్లతో గస్తీ నిర్వహిస్తున్నాయి.

ఫాక్ట్ (నిజం): వీడియోలో చూపించిన హెలికాప్టర్లు భారత దేశానికి సంబంధించినవి కాదు. అమెరికా దేశంలోని హవాస సరస్సు పై U.S అపాచీ హెలికాప్టర్లు సంచరిస్తున్న వీడియో అది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వీడియోలోని స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘Chonday.com’ అనే వీడియో ప్లాట్ ఫార్మ్లో అమెరికాలోని హవాస సరస్సు పై తక్కువ ఎత్తులో సంచరిస్తున్న U.S అపాచి హెలికాప్టర్లు, అంటూ షేర్ చేసిన వీడియోలో ఇవే దృశ్యాలు కనిపించాయి. ఈ సమాచారం ఆధారంగా గూగుల్ లో సెర్చ్ చేయగా, 2018లో పోస్ట్ చేసిన యుట్యూబ్ వీడియోలో కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. ఆ వీడియో కింద వివరణలో హవాస సరస్సు దగ్గర తీసిన వీడియో ఇది అని ఉండటం గమనించవొచ్చు.

భారత అపాచి హెలికాప్టర్లు లేత బూడిద రంగులో ఉంటుంది, కాని వీడియోలో కనిపిస్తున్న అపాచీ హెలికాప్టర్లు నలుపు రంగులో ఉండటం మనం చూడొచ్చు. అలాగే, వీడియో లోని హెలికాప్టర్ల పై భారత దేశ చిహ్నాలు కూడా లేవు. వీటన్నిటి ఆధారంగా, ఈ వీడియో ఖచ్చితంగా అమెరికాలో తీసింది అని చెప్పొచ్చు.

చివరగా, అమెరికాకు సంభందించిన హెలికాప్టర్ల వీడియోని చూపిస్తూ పాంగోంగ్ సరస్సు పై గస్తీ నిర్వహిస్తున్న భారత సైన్యం అంటూ షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll