వందల సంఖ్యలో ప్రజలు చిందులేస్తూ సంబరాలు జరుపుకుంటున్న ఒక వీడియో క్లిప్పుని (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “మాత ముంబా దేవి నగరం ముంబయిలో లాల్ బగీచ గణేష మండపం ముందు స్వర బద్ధ సంగీతం, లయ బద్ధ నాట్యంతో భక్తి పారవశ్యoతో నాట్యం చేస్తున్న మన హిందూ ఆబాల గోపాలం.” అని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఎంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ముంబైలోని లాల్ బాగ్చా గణేష్ మండపం ఎదుట భక్తి పర్వ నాట్యం చేస్తున్న భక్తుల వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో స్పెయిన్ దేశానికి చెందిన ఒక స్వయం పాలిత ప్రాంతమైన నవర్రెలో తీసినది, ముంబైలోని లాల్ బాగ్చా గణేష్ మండపం ఎదుట కాదు. నవర్రెలో ప్రతి ఏడాది జరిగే ‘ఫెస్టివల్ ఆఫ్ సాన్ ఫెర్మిన్’ జరుగుతున్న సమయంలో తీసిన వీడియో ఇది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోలో చేస్తున్న క్లెయిమ్‌ని వెరిఫై చేయడానికి అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చెక్ చేస్తే, ఈ వీడియో నిజానికి స్పెయిన్ దేశంలో తీసారని, ముంబైలో కాదని మాకు అర్థం అయింది.

Tripscout అనే ట్రావెల్ కంపెన వారు ఈ ఫెస్టివల్ యొక్క వీడియోని 17 ఫిబ్రవరి 2024న వారి వెరిఫైడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో మరియు వైరల్ వీడియో, రెండిటినీ సుమారుగా ఒకే యాంగిల్ నుంచి ఒకే చోట చిత్రించారు. Tripscout వారి పోస్ట్ వివరాణలో, ఈ వీడియో ‘ఫెస్టివల్ ఆఫ్ సాన్ ఫెర్మిన్’కి సంబంధించిందని రాశారు. ఇది స్పెయిన్ దేశంలో ఉన్న నవర్రె అనే స్వయంపాలిత ప్రాంతంలో ప్రతి ఏడాది జరిగే ఒక పండుగ.

Pamplona Fiesta అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఇదే వీడియోని 2 జనవరి 2024న అప్లోడ్ చేశారు. ఈ ఫెస్టివల్ యొక్క ఆరంభ వేడుకల్ని Chupinazo అని అంటారు అని ఈ వీడియో టైటిల్‌లో చెప్పారు.ఇదే వీడియోని @pamplona_fiesta అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వారు పోస్ట్ చేస్తూ, ఈ ఫెస్టివల్ యొక్క లాంచ్(ఓపెనింగ్ సెర్మనీ) రోజున, ప్రజలు పాంప్లోనా ‘సిటీ హాల్’ దగ్గర గుమిగూడతారు అని రాశారు. దీని గురించి మరిన్ని వివరాలని తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతికితే, ఈ విషయానికి సంబంధించిన అనేక వార్తా కథనాలు(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) మాకు దొరికాయి. ఈ పండుగని యేటా జూలై 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుపుకుంటారట. ‘రన్నింగ్ ఆఫ్ బుల్స్’ అనే ఈవెంట్ ఈ పండుగ యొక్క ప్రత్యేకత (ఇక్కడ, ఇక్కడ).

వైరల్ వీడియోని తీసిన లొకేషన్‌ని వెరిఫై చేయడానికి పాంప్లోనా నగరం యొక్క ‘సిటీ హాల్’ గురించి గూగుల్ మ్యాప్స్‌లో వెతికితే, పాంప్లోన సిటీ హాల్(ఇక్కడ, ఇక్కడ), వీడియోలో మనకి కనిపిస్తున్న భవనం, రెండు ఒకటే అని మాకు అర్థం అయ్యింది(ఇక్కడ, ఇక్కడ).అలాగే, ‘ఫెస్టివల్ ఆఫ్ సాన్ ఫెర్మిన్’కి చెందిన అనేక వీడియోలలో కూడా మీరు ఈ సిటీ హాల్ భవనాన్ని చూడవచ్చు. దీనిబట్టి ఈ వీడియో ముంబైలోని లాల్ బాగ్చా గణేష్ మండపం ఎదుట తీసింది కాదు, స్పెయిన్‌లో తీసిన వీడియో అని మనకి స్పష్టంగా అర్థం అవుతోంది.

చివరిగా, స్పెయిన్‌లో తీసిన ఒక వీడియోని, ముంబైలోని లాల్ బాగ్చా గణేష్ మండపం దగ్గర తీసిన వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.