Fake News, Telugu
 

రూ.2 వేల నోటు SBI నిలిపివేసింది అనే వార్త ఫేక్

1

వివరణ (22 May 2023): 2000 రూపాయల నోట్లను చెలామణీ నుండి ఉపసంహరిస్తామని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (RBI) 19 May 2023న ప్రకటించింది. వీటికి సంబందించిన వివరాలు ప్రకటించింది. 30 సెప్టెంబర్ లోపు 2000 రూపాయల నోట్లు మార్చుకోవొచ్చని కూడా చెప్పింది.

రూ. 2 వేల నోట్లని రద్దు చేస్తున్నారని, SBI ATM లలో రూ. 2 వేల నోట్లని  ఉంచే క్యాసెట్ ని తొలగించారని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం కాబడుతోంది. ఆ పోస్ట్ యొక్క క్లెయిమ్ లో ఎంత వరకు నిజం ఉందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రూ. 2 వేల నోట్లని రద్దు చేస్తున్నారని, SBI ATM లలో 2000 రూపాయల నోట్లు ఉంచే క్యాసెట్ ని తొలగించారు, కావున ఆ బ్యాంకుకి సంబంధించిన ATM ల నుండి 2000 రూపాయల నోట్లు తీసుకోలేము.

ఫాక్ట్ (నిజం): RBI వెబ్సైటు లోని సమాచారం ప్రకారం అసలు RBI రూ. 2 వేల నోట్ల రద్దు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిసింది. అంతేకాక, SBI అధికారి ఇచ్చిన సమాచారం మేరకు రూ. 2 వేల నోట్లను ఇంతకుముందు లాగానే ATM లలో నింపుతున్నారని తెలిసింది. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) రూ. 2 వేల నోట్ల రద్దు గురించి ఈ మధ్య ఏమైనా ప్రకటనలు చేసిందా అని తెలుసుకోవడానికి RBI వారి వెబ్సైటు కి వెళితే వారు అలాంటి  ప్రకటనలు ఏమి చేయలేదని తెలిసింది. గత రెండు సంవత్సరాల నుంచి RBI రూ. 2 వేల నోట్ల ప్రింటు సంఖ్య తగ్గించినప్పటికీ, ఆ నోట్లను రద్దు చేస్తున్నారని మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

SBIకి సంబంధించిన ATM ల నుండి రూ. 2 వేల నోట్లు రావు, మరియు ఆ నోట్లను ఉంచే క్యాసెట్లను ATM ల నుంచి తొలగిస్తున్నారు అనేది పోస్ట్ లో చేయబడ్డ ఇంకొక క్లెయిమ్. దీని గురించి FACTLY ఒక SBI అధికారి ని సంప్రదించగా, అతను, SBI అలాంటి నిర్ణయమేమి తీసుకొలేదని, రూ. 2 వేల నోట్లను ఇంతకముందు లానే ATM మెషిన్ లలో పెడుతున్నారని తెలిపాడు.  అంతేకాక, FACTLY రూ. 2 వేల నోటు ని  హైదరాబాద్ లోని ఒక SBI ATM లో  నుండి తీసుకోగలిగింది.

చివరగా,  రెండు వేల రూపాయల నోటు రద్దు చేయడం మరియు SBI ATM ల నుండి రూ. 2 వేల నోట్లను తీసుకోలేము అని పోస్ట్ లో చేయబడ్డ క్లెయిమ్ లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll