Fake News, Telugu
 

‘Village Defence Guards’ అనేది జమ్మూ కశ్మీర్‌లో కేవలం హిందువులకు ఆయుధాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పథకం కాదు

0

జమ్మూకాశ్మీర్‌లో హిందువులను ఆధార్ కార్డులను చూసి మరీ చంపుతుండటంతో..ఇక హిందూ యువకులను శిక్షణ ఇచ్చి, ఆయుధాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీరిని Village Defence Guards అని పిలువనున్నారు”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇకపై ‘Village Defence Guards’ పథకం కింద జమ్మూకశ్మీర్‌ హిందూ యువకులకు ఆయుధాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఫాక్ట్: మిలిటెన్సీకి వ్యతిరేకంగా ‘Village Defence Groups’ను ఏర్పాటు చేస్తూ 1995లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆగస్టు 2022లో ‘Village Defence Guards’ పథకానికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీఓ ఇచ్చింది. అయితే, పాత మరియు కొత్త పథకాల్లో కేవలం హిందువులకు మాత్రమే ఆయుధాలు ఇవ్వాలని ఎక్కడా కూడా లేదు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్ట్‌లో చెప్పిన ‘Village Defence Guards’ గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, మిలిటెన్సీకి వ్యతిరేకంగా ‘Village Defence Groups’ను ఏర్పాటు చేస్తూ1995లోనే  ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆ నిర్ణయానికి సంబంధించిన జీవోని ఇక్కడ చూడవచ్చు.

‘Village Defence Guards’ పథకానికి సంబంధించి ఆగస్టు 2022లో ఇచ్చిన జీవోని ఇక్కడ చూడవచ్చు. ఆ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు జీవో డాక్యుమెంట్‌లో చదవచ్చు. అయితే, పాత మరియు కొత్త పథకాల్లో కేవలం హిందువులకు మాత్రమే ఆయుధాలు ఇవ్వాలని ఎక్కడా కూడా లేదు.

‘Village Defence Guards’పై వివిధ వార్తా సంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ‘Village Defence Groups’లో ఎక్కువ శాతం హిందువులే ఉన్నట్టు కొన్ని వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ‘Village Defence Guards’ అనేది జమ్మూ కశ్మీర్‌లో కేవలం హిందువులకు ఆయుధాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పథకం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll