Fake News, Telugu
 

ఈ CAA మద్దతు ర్యాలీ అస్సాంలో జరిగింది, తమిళనాడులో కాదు

0

తమిళనాడు చరిత్రలోనే (CAB కు మద్దత్తుగా) అతి భారీ ర్యాలి నిర్వహించిన తమిళనాడు జాతీయవాదులు … ఈ ర్యాలికి వచ్చిన జనాన్ని చూసి #DMK పార్టీ కి మతిపోయింటాది’ అంటూ ఒక ర్యాలీ ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: CAA కు మద్దతుగా తమిళనాడులో నిర్వహించిన ర్యాలీ యొక్క ఫోటో.

ఫాక్ట్ (నిజం): అస్సాంలో CAA కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీ యొక్క ఫోటోని పెట్టి, తమిళనాడు లో నిర్వహించిన ర్యాలీ ఫోటో అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని బీ.ఎల్.సంతోష్ (బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ) కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టుగా చూడవొచ్చు. ఆ ఫోటో అస్సాంలో CAA కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీ కి సంబంధించిన ఫోటోగా ఆ ట్వీట్ లో చదవొచ్చు. అదే ఫోటోని అస్సాం బీజేపీ మంత్రి హిమంత్ బిస్వ శర్మ కూడా ట్వీట్ చేసినట్టుగా చూడవొచ్చు. తమిళనాడు లో CAA కు మద్దతుగా బీజేపీ పార్టీ ర్యాలీ నిర్వహించింది, కానీ పోస్ట్ లోని ఫోటో తమిళనాడు ర్యాలీకి సంబంధించింది కాదు.

చివరగా, పోస్టులోని ఫోటో అస్సాంలో CAA కు మద్దత్తుగా నిర్వహించిన ర్యాలీకి సంబంధించింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll