‘JNU లో ABVP కి మద్దతుగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్’ అని చెప్తూ, ABVP జెండా పట్టుకొని ఉన్న అక్షయ్ కుమార్ ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం
క్లెయిమ్: JNU లో ABVP కి మద్దతుగా ABVP జెండా పట్టుకున్న అక్షయ్ కుమార్ ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఆ ఫోటో ఢిల్లీ యూనివర్సిటీ ‘Women Marathon’ కి సంబంధించినదిగా 2018 లోనే అక్షయ్ కుమార్ ట్వీట్ చేసాడు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అక్షయ్ కుమార్ ABVP జెండా పట్టుకున్న ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్ లో చాలా వస్తాయి. జనవరి-2018 లో ‘ProKerala’ వారు ప్రచురించిన ఆర్టికల్ లో ఆ ఫోటో గురించి వివరాలు చూడవొచ్చు. ఢిల్లీ యూనివర్సిటీ (DU) (జే.ఎన్.యూ కాదు) ‘Woman Marathon’ ని అక్షయ్ కుమార్ ప్రారంభించేటప్పుడు తీసిన ఫోటో అది అని తెలుస్తుంది. ఆ ఫోటో “Delhi University’s Women Marathon” కి సంబంధించినదిగా 2018 లోనే అక్షయ్ కుమార్ ట్వీట్ కూడాచేసాడు.
చివరగా, 2018 ఢిల్లీ యూనివర్సిటీ ‘Woman Marathon’ కి సంబంధించిన ఫోటో పెట్టి, ‘JNU లో ABVP కి మద్దత్తుగా అక్షయ్ కుమార్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?