ఆసుపత్రిలో కింద కూర్చొని చికిత్స పొందుతున్న అమ్మాయిల ఫోటోని ఫేస్బుక్ లో పెట్టి, ఆ ఫోటోని తెలంగాణా లో తీసినట్టు కొందరు షేర్ చేస్తుంటే, మరికొందరు తాజాగా (వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో) ఆంధ్రప్రదేశ్ లోని ఆసుపత్రి లో తీసినట్టు షేర్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ 1: ఆసుపత్రిలో కింద కూర్చొని చికిత్స పొందుతున్న అమ్మాయిల ఫోటో తెలంగాణ కి సంబంధించినది.
క్లెయిమ్ 2: ఆసుపత్రిలో కింద కూర్చొని చికిత్స పొందుతున్న అమ్మాయిల ఫోటోని తాజాగా (వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో) ఆంధ్రప్రదేశ్ లో తీసారు.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటోని గత సంవత్సరం సెప్టెంబర్ లో విజయనగరం జిల్లా లోని సాలూర్ ప్రభుత్వ ఆసుపత్రి లో తీసారు. ఆ ఫోటోకి, తెలంగాణకి అసలు సంబంధం లేదు. అంతేకాదు, మరో పోస్ట్ లో చెప్పినట్టు ఫోటోలోని సంఘటన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని గూగల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోతో కూడిన ‘The Hindu’ ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ లో ఫోటోలోని సంఘటన గత సంవత్సరం సెప్టెంబర్ లో జరిగినట్టు ఉంటుంది. విజయనగం జిల్లాలోని సాలూర్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఆ ఫోటోని తీసినట్టు ఆ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఈ సంఘటన పై మరింత సమాచారం కోసం, అప్పట్లోనే ఈ సంఘటన కి సంబంధించి సాక్షి వార్తాసంస్థ వారు ప్రచురించిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, గత సంవత్సరం విజయనగరంలో తీసిన ఫోటోని పెట్టి ‘తెలంగాణలో’ మరియు ‘తాజాగా ఆంధ్రప్రదేశ్ లో’ తీసినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?