Fake News, Telugu
 

అది ‘విక్రమ్ లాండర్’ తీసిన ఫోటో కాదు. 1970 ప్రాంతంలో ‘అపోలో’ స్పేస్ క్రాఫ్ట్ తీసింది

1

లాండర్ నుండి సంకేతాలు అందడం లేదు తప్ప శాటిలైట్ మొత్తం పనిచేస్తూనే ఉంది.. శాటిలైట్ నుండీ జాబిల్లి ని తీసిన అద్భుతమైన ఫొటో’ అని ఇస్రో ఛైర్మన్ శివనారాయన్ వెల్లడించాడంటూ, అందుకు సంబంధించిన ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. ఆ ఫోటో ఎంతవరకు వాస్తవమైనదో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : విక్రమ్ లాండర్ తీసిన ఫోటో.   

ఫాక్ట్ (నిజం): అది ‘విక్రమ్ లాండర్’ తీసిన ఫోటో కాదు. 1970 ప్రాంతంలో ‘అపోలో’ స్పేస్ క్రాఫ్ట్ తీసింది. కావున, పోస్టులో చేసిన ఆరోపణ తప్పు. 

“చంద్రయాన్ 2” మిషన్ ద్వారా ఇస్రో ‘విక్రమ్ లాండర్’ ని చంద్రుడి పైకి ఈ నెల సెప్టెంబర్ 7న పంపింది. కానీ, అది టేకాఫ్ అయిన కొంతసేపటికే గ్రౌండ్ కంట్రోల్ నుండి కమ్యూనికేషన్ కోల్పోయింది. ఆ తర్వాత, సెప్టెంబర్ 8న ఇస్రో చైర్మన్ శివన్ విక్రమ్ లాండర్ ఆచూకీ తెలిసిందని, అందుకు సంబంధించిన థర్మల్ ఇమేజ్ లభించిందని మరియు లాండర్ తో కమ్యూనికేషన్ ఏర్పరచదానికి ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు.

కానీ, ఒక ఫోటో విక్రమ్ లాండర్ తీసిన ఫోటోగా చలామణి అవుతోంది. పోస్టులో పెట్టిన ఆ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ ఫోటో చాలా సంవత్సరాలుగా ఇంటర్నెట్ లో చలామణి అవుతున్నట్లుగా తెలిసింది. 

ఆ ఫోటోని ‘అపోలో’ స్పేస్ క్రాఫ్ట్ తీసినట్లుగా ‘యునివర్సిటీస్ స్పేస్ రీసెర్చ్ అసోసియేషన్ ‘వారి వెబ్సైటు లో చూడవచ్చు. అదే ఫోటో ని నాసా వారి అధికారిక వెబ్సైటు లో కూడా చూడొచ్చు. ఇదే ఫోటోని అమెరికా ప్రభుత్వ అధికారిక ఆర్కైవ్స్ లో డేట్ తో సహా చూడొచ్చు.

చివరగా, అది ‘విక్రమ్ లాండర్’ తీసిన ఫోటో కాదు. దానిని 1970 ప్రాంతంలో ‘అపోలో’ స్పేస్ క్రాఫ్ట్ తీసింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll