Fake News, Telugu
 

చంద్రయాన్-3 కి తను ‘మిషన్ మంగళ్’ సినిమా డబ్బులు ఇస్తున్నట్టుగా అక్షయ్ కుమార్ ఎక్కడా చెప్పలేదు

1

తను నటించిన మిషన్ మంగళ్ సినిమాకి వచ్చిన డబ్బులను చంద్రయాన్-3 కి ఇస్తానని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చెప్పినట్టు ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : అక్షయ్ కుమార్: “‘మిషన్ మంగళ్’ సినిమాకి వచ్చిన డబ్బులు అన్నిటిని చంద్రయాన్-3 కి ఇచ్చేస్తాను.”   

ఫాక్ట్ (నిజం): చంద్రయాన్-3 కి తను డబ్బులు ఇస్తున్నట్టుగా అక్షయ్ కుమార్ ఎక్కడా కూడా చెప్పలేదు. తను ఇస్తున్నట్టుగా వార్తాసంస్థలు కూడా ఎక్కడా ప్రచురించలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం. 

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘Akshay Kumar donates Mission Mangal money to Chandrayaan 3’ అని వెతకగా, అక్షయ్ కుమార్ చంద్రయాన్-3 కి డబ్బులు ఇస్తున్నట్టుగా ఏ ఒక్క వార్తాసంస్థ కూడా ప్రచురించలేదని తెలుస్తుంది.

అక్షయ్ కుమార్ ఏమన్నా అలా ప్రకటించాడా అని తన ట్విట్టర్ అకౌంట్ లో వెతకగా, తను చంద్రయాన్-3 పై కేవలం ఒక ట్వీట్ మాత్రమే చేసినట్టు తెలుస్తుంది. ఆ ట్వీట్ లో కూడా తను చంద్రయాన్-3 కి డబ్బులు ఇస్తున్నట్టుగా ఏమీ రాయలేదు. చంద్రయాన్-3 మిషన్ గురించి ఇక్కడ చదవచ్చు.

చివరగా, చంద్రయాన్-3 కి తను ‘మిషన్ మంగళ్’ సినిమా డబ్బులు ఇస్తున్నట్టుగా అక్షయ్ కుమార్ ఎక్కడా కూడా చెప్పలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll