Fake News, Telugu
 

2019లో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో నీళ్ళు లీక్ అయిన ఘటనను వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

ట్రైన్ కంపార్టుమెంటులోనికి నీళ్ళు లీక్ అవుతున్న వీడియోని షేర్ చేస్తూ ఇది వందే భారత్ రైలులో జరిగిన ఘటనగా సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: వందే భారత్ రైలులో నీళ్ళు లీక్ అవుతున్న వీడియో.

ఫాక్ట్: ఈ ఘటన 29 జూన్ 2019న దానాపూర్ నుంచి బెంగళూరు వెళుతున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ లో జరిగింది. నాగపూర్ దగ్గర భారీ గాలివాన కారణంగా ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ యొక్క డ్రెయిన్ హోల్ లో ఆకులు మరియు చెత్త పేరుకొని పోవడం వలన ‘Return Air duct’ పైన పడిన నీరు, కంపార్టుమెంటులోకి లీక్ అయ్యాయి. దీనిని 90 నిముషాలలో రైల్వే సిబ్బంది సరి చేశారు. పైగా, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇప్పటి వరకు అయితే కేవలం కూర్చొని ప్రయాణించడానికి వీలుగా ఉండే సీట్లు మాత్రమే ఉన్నాయి. వీడియోలో చూపించినట్లు బెర్త్ లు లేవు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని ‘సూయగ్య రాయ్’ అనే వ్యక్తి  ట్విట్టర్ లో 29 జూన్ 2019లో అప్లోడు చేసినట్లు గుర్తించాము. “సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని ‘A1’ బోగీ లో ఈ ఘటన జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే రైల్వే శాఖ వారు వెంటనే స్పందించి లోపాన్ని సరిచేశారని ఆయన మరొక ట్వీట్ లో చెప్పారు.

IndiaTV, Times of India కథనాల ప్రకారం 29 జూన్ 2019 న దానాపూర్ నుండి బెంగళూరు వెళుతున్న ‘సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్’లో ఈ ఘటన జరిగింది. నాగపూర్ దగ్గర భారీ గాలి వాన కారణంగా ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ యొక్క డ్రెయిన్ హోల్ లో ఆకులు మరియు చెత్త పేరుకొని పోవడం వలన ‘Return Air duct’ పైన పడిన నీరు, కంపార్టుమెంటులోకి లీక్ అయ్యాయి. దీనిని 90 నిముషాలలో రైల్వే సిబ్బంది సరి చేశారు. పైగా, ఫిబ్రవరి 2019 న ప్రారంభించిన వందే భారత్ రైలులో ఇప్పటి వరకు అయితే కేవలం కూర్చొని ప్రయాణించడానికి వీలుగా ఉండే సీట్లు మాత్రమే ఉన్నాయి, వైరల్ వీడియోలో చూపించినట్లు బెర్త్ లు లేవు. స్లీపర్ లను కూడా వందే భారత్ రైళ్లలో త్వరలోనే పవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.

చివరిగా, 2019 లో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ లో జరిగిన సంఘటనని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు తప్పుగా ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll