Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఫోటోని బుర్జ్ ఖలీఫా భవనం పై రోహిత్ శర్మ ఫోటో ప్రదర్శించినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

భారత క్రికెట్ జట్టు ఓపెనర్ మరియు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫోటో ప్రపంచంలోనే ఎతైన బుర్జ్ ఖలీఫా టవర్ పై ప్రదర్శించారు, అంటూ ‘NTV’ న్యూస్ ఛానల్ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహాత్మా గాంధీ, షారుఖ్ ఖాన్ తరువాత ఈ గౌరవం అందుకున్న మూడో భారతీయుడు రోహిత్ శర్మ, అని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఫోటో, దుబాయ్ బుర్జ్ ఖలీఫా భవనంపై ప్రదర్శించారు.

ఫాక్ట్ (నిజం): బుర్జ్ ఖలీఫా భవనం పై రోహిత్ శర్మ ఫోటో ప్రదర్శినట్టుగా షేర్ చేసిన ఆ ఫోటో ఎడిట్ చేయబడినది. ముంబై ఇండియన్స్ జట్టు IPL 2020 టైటిల్ విజేతగా నిలిచిన నేపధ్యంలో ఈ ఎడిట్ చేసిన ఫోటో వైరల్ అవుతుంది. రోహిత్ శర్మ ఫోటో గాని, మరో ముంబై ఇండియన్స్ జట్టులోని ఏ క్రికెటర్ ఫోటో బుర్జ్ ఖలీఫా భవనంపై ప్రదర్శించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

రోహిత్ శర్మ ఫోటో బుర్జ్ ఖలీఫా భవనంపై ప్రదర్శించడానికి సంబంధించిన సమాచారం కోసం వెతికితే, ఈ ప్రదర్శనకు సంబంధించి బుర్జ్ ఖలీఫా తమ ట్విట్టర్ అకౌంట్లో ఎటువంటి ట్వీట్ చేయలేదని తెలిసింది. రోహిత్ శర్మ కూడా ఈ ప్రదర్శనకి సంబంధించి తన ట్విట్టర్ అకౌంట్లో ఎటువంటి పోస్ట్ చేయలేదు. ముంబై ఇండియన్స్ జట్టు IPL 2020 టైటిల్ విజేతగా నిలిచిన నేపధ్యంలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. పోస్టులో షేర్ చేసిన ఆర్టికల్ లోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఒరిజినల్ ఫోటోని షేర్ చేస్తూ ‘Emirates 24/7’  న్యూస్ వెబ్సైటు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది.

IPL 2020 టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, బుర్జ్ ఖలీఫా భవనం పై ముంబై ఇండియన్స్ లోగో ప్రదర్శించిన ఫోటోని తమ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసారు. ముంబై ఇండియాన్స్ షేర్ చేసిన ఈ ఫోటో గ్రాఫిక్ డిజైనర్ చేసినది అని తెలిసింది. ముంబై ఇండియన్స్ తమ ట్వీట్లో, ఈ ఫోటో డిజైన్ చేసినది అమిత్ హరి అనే గ్రాఫిక్ డిజైనర్ అని క్రెడిట్స్ ఇచ్చింది.

IPL 2020 టోర్నమెంట్ లో పాల్గొనడానికి దుబాయ్ కి వచ్చిన కొలకత్తా నైట్ రైడర్స్ టీం కి స్వాగతం పలుకుతూ బుర్జ్ ఖలీఫా మేనేజ్‌మెంట్, కొలకత్తా టీం ప్లేయర్ల ఫోటోలని బుర్జ్ ఖలీఫా భవనం పై ప్రదర్శించారు. కొలకత్తా టీం ప్లేయర్లకి మాత్రమే ఇలా స్వాగతం పలకడానికి కారణం తెలుసుకొనేందుకు బుర్జ్ ఖలీఫా యాజమాన్యాన్ని సంప్రదించాము. వారి సమాధానం రాగానే ఈ ఆర్టికల్ ని అప్డేట్ చేస్తాము.

చివరగా, ఎడిట్ చేయబడిన ఫోటోని షేర్ చేస్తూ రోహిత్ శర్మ ఫోటోని బుర్జ్ ఖలీఫా భవనం పై ప్రదర్శించినట్టుగా NTV న్యూస్ ఛానల్ తప్పుగా రిపోర్ట్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll