Fake News, Telugu
 

హర్యానాలో జరిగిన ఫుడ్ సేఫ్టీ తనిఖీలకు సంబంధించిన ఫోటోని RJD పార్టీకి ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఇద్దరు వ్యక్తులు స్వీట్స్ ని పూడ్చి పెడుతున్న ఫోటోని చూపిస్తూ బీహార్ ఎలక్షన్స్ లో RJD కార్యకర్తలు తమ పార్టీ గెలిచినాక పంచి పెడదామనుకున్న స్వీట్స్ ని ఓడిపోయిన కారణంగా ఇలా పూడ్చి పెడుతుందని చేప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీహార్ ఎలక్షన్స్ లో RJD ఓడిపోయిన కారణంగా కార్యకర్తలు స్వీట్స్ ని భూమిలో పూడ్చి పెడుతున్నారు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో హర్యానాలోని సిర్స అనే పట్టణంలో పండగ రోజులు కాబట్టి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తో కలిసి ముఖ్యమంత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖిల్లో లభ్యమైన అపరిశుభ్రమైన స్వీట్స్ ని అధికారుల ఆదేశాల మేరకు భూమిలో పూడ్చి పెడుతున్న ఘటనకి సంబంధించింది. ఈ ఫోటోకి బీహార్ ఎలక్షన్స్ కి గాని, RJD పార్టీకి గాని ఎటువంటి సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది, ఈ వార్త 10 నవంబర్ 2020న ప్రచురించబడింది. ఐతే ఈ వార్తా కథనం ప్రకారం ఈ ఫోటో హర్యానాలోని సిర్స అనే పట్టణంలో పండగ రోజులు కాబట్టి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తో కలిసి ముఖ్యమంత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో లభ్యమైన అపరిశుభ్రమైన స్వీట్స్ ని అధికారుల ఆదేశాల మేరకు భూమిలో పూడ్చి పెడుతున్న ఘటనకి సంబంధించింది.

ఈ తనిఖీలకి సంబంధించి మరొక ఫోటో ప్రచురించిన ఇంకో వార్తా కథనం మాకు దొరికింది, ఈ కథనం కూడా ఈ ఫోటో సిర్సలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీలకు సంబంధించినదిగా దృవీకరిస్తుంది. వీటన్నిటి బట్టి పోస్టులో చూపిస్తున్న ఫోటోకి బీహార్ ఎలక్షన్స్ కి గాని, RJD పార్టీకి గాని ఎటువంటి సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇటీవల బీహార్ లో జరిగిన ఎన్నికల్లో RJD పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు కొన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, హర్యానాలో జరిగిన ఫుడ్ సేఫ్టీ తనిఖీలకి సంబంధించిన ఫోటోని బీహార్ ఎలక్షన్స్ లో RJD ఓడిపోయిన కారణంగా స్వీట్స్ ని పూడ్చి పెడుతున్నారని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll