Fake News, Telugu
 

ఒక మరుగుతున్న గిన్నెలో బ్రెడ్ ముక్క తింటున్న ఈ పీత వీడియో ఎడిట్ చేసినది

0

ఒక మరుగుతున్న కూర గిన్నెలో ఉన్న ఒక పీత ఒక రొట్టె ముక్కను ఆస్వాదిస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘చస్తూ కూడా చిల్ అవుతుంది’ అనే వివరణతో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఈ ఆర్టికల్ ద్వారా ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో తెలుసుకుందాం. 

క్లెయిమ్ : ఒక పీత ఒక మరిగే గిన్నెలో రొట్టె తింటున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం):  ఇది రెండు వేరు వేరు వీడియోలను ఉపయోగించి ఎడిట్ చేసిన వీడియో. ఒక పీత ఒక రొట్టె ముక్కను తింటున్న ఒరిజినల్ వీడియో, కనీసం సెప్టెంబర్ 2023 నాటి నుండి ఇంటర్నెట్‌లో ఉంది, నల్ల గులకరాళ్లను పోలి ఉండే రాళ్లపై ఒక పీత బ్రెడ్ తింటున్నట్లు ఈ వీడియోలో ఉంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు. 

ఈ క్లెయిమ్ యొక్క నిజానిజాలను ధృవీకరించడానికి, ముందుగా ఇంటర్నెట్‌లో ఒక కీవర్డ్ సెర్చ్ చేసాం. దీని ద్వారా, సెప్టెంబర్ 2023 నుండి YouTubeలో “క్రాబ్ ఈటింగ్ బ్రెడ్ #వైరల్” అనే శీర్షికతో ఉన్న ఒక వీడియో దొరికింది. దీనితోపాటు ఇదే వీడియో ఉన్న చాలా సోషల్ మీడియా పోస్టులు కూడా దొరికాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). 

ఈ అసలు వీడియోలో, వైరల్ ఫుటేజీలో చిత్రీకరించిన మరిగే గిన్నె దృశ్యానికి విరుద్ధంగా రాళ్లపై ఉండే రొట్టె ముక్కని తింటున్న ఒక  పీత కనిపిస్తుంది.

ఈ రెండు వీడియోలను పక్కపక్కనే పోల్చినప్పుడు ఎడిటింగ్ మానిప్యులేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. నేపథ్యాలలో వ్యత్యాసం, ఒకటి రాతి surface పైన వుంటే, మరొకటి మరిగే గిన్నె. మీరు సరిగ్గా చుస్తే ఒరిజినల్ వీడియోలో కనిపిస్తున్న నల్ల గులకరాయి ఇంకా పీత వెనుక ఉన్న టిష్యూ పేపర్స్ కూడా ఎడిట్ చేసిన వైరల్  వీడియోలో గిన్నెలో కనిపిస్తాయి. 

చివరిగా, ఒక మరుగుతున్న గిన్నెలో బ్రెడ్ ముక్క తింటూ చిల్ అవుతున్న పీత అని ఒక ఎడిటెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll