Fake News, Telugu
 

వీడియోలో డబ్బులు ఇస్తున్నది ఢిల్లీ అల్లర్ల బాధితులకు సహాయంగా, షహీన్ బాగ్ నిరసనకారులకు కాదు

0

షహీన్ బాగ్ నిరసనకారులకు డబ్బులు పంచుతున్న దృశ్యాలు అని చెప్తూ, ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: షహీన్ బాగ్ నిరసనకారులకు డబ్బులు పంచుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని దృశ్యాలు షహీన్ బాగ్ నిరసనకి సంబంధించినవి కావు. అది ఢిల్లీ లోని బాబునగర్ లో తీసిన వీడియో. అక్కడ ఢిల్లీ అల్లర్ల బాధితులకు ముందుగా రేషన్ పంచారు; అది అయిపోవడంతో కొంత మందికి డబ్బులు పంచారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

వీడియోలోని దృశ్యాల గురించి వెతకగా, ‘Indian Express’ ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. ఆ ఆర్టికల్ ద్వారా ఢిల్లీ లో అల్లర్లు జరిగిన వివిధ ప్రదేశాల్లో ఆహరం మరియు రేషన్ కోసం ప్రజలు లైన్లు కట్టినట్టు తెలుస్తుంది. ఆర్టికల్ లోని ఫోటోలను తీసిన గజేంద్ర యాదవ్ కి FACTLY  ఫోన్ చేసి మాట్లాడగా, ఆ ఫోటోలను యమునా విహార్ లో తీసానని, బాధితులను లైన్లలలో నిల్చోపెట్టి రేషన్ కొరకు చిట్టీలు ఇస్తున్నారని తెలిపాడు. యమునా విహార్ కి సంబంధించి FACTLY కి మరికొన్ని ఫోటోలను గజేంద్ర యాదవ్ పంపించారు; వాటిని కింద చూడవొచ్చు.

అయితే, పోస్ట్ చేసిన వీడియోలోని దృశ్యాలు ఢిల్లీలోని బాబునగర్ లో తీసినట్టు చెప్తూ, అందులో బాధితులకు కొంత మంది సహాయం చేస్తున్నారని ‘Shaheen Bagh Official’ వారు ట్విట్టర్ లో ఒక వీడియో ట్వీట్ చేసారు. అందులో మాట్లాడుతున్న సోషల్ ఆక్టివిస్ట్ ‘చంద్ర మోహన్’ ఫేస్బుక్ ప్రొఫైల్ లో పూర్తి వీడియోని చూడవొచ్చు. ఆ వీడియోని అదే గల్లీలో తీసినట్టు చెప్తూ చంద్ర మోహన్ పలు రుజువులు కూడా వీడియోలో చూపిస్తాడు. 

ముందుగా బాబు నగర్ లో బాధితులకు రేషన్ పంచారని, అది అయిపోవటంతో షెహజాద్ (పైన ఫొటోలో నలుపు రంగు డ్రెస్ వేసుకున్నతను) అనే వ్యక్తి మిగితా బాధితులకు అయిదు వందల చొప్పున డెబ్భై వేలు పంచాడని వీడియోలో చంద్రమోహన్ చెప్తారు. ముందు రేషన్ ఇచ్చినప్పటి వీడియోని కూడా చంద్ర మోహన్ పోస్ట్ చేసిన వీడియోలో చూడవొచ్చు.

వీడియో తీసిన ప్రదేశానికి (బాబునగర్), షహీన్ బాగ్ నిరసన స్థలానికి సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉన్నట్టు చూడవొచ్చు.

చివరగా, ఢిల్లీ అల్లర్ల భాదితులకు చేస్తున్న సహాయం వీడియో పెట్టి, షహీన్ బాగ్ నిరసనకారులకు డబ్బులు ఇస్తున్నారని షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll