Fake News, Telugu
 

తెలంగాణా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తోంది అని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసిన మంత్రి గంగుల కమలాకర్

0

ఆగష్టు 21వ తేదీ 2023 నుండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల పంపిణి ఆగస్టు 21వ తేదీ 2023 నుండి జరగనుంది. 

ఫాక్ట్(నిజం): తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇది అవాస్తవం అని చెప్పారు. రాష్త్ర ప్రభుత్వం ఇంకా పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టలేదు అని, ఇలాంటి తప్పుడు ప్రచారాల్ని ఎవరూ నమ్మొద్దు అని పేర్కొన్నారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాల్ని తెలుసుకోవటానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ విషయానికి సంబందించిన అనేక వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, నిన్న(17 ఆగష్టు 2023) తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ విషయంపై విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన ద్వారా, ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ‘అసత్య ప్రచారాల్ని’ నమ్మొద్దు అని ఆయన పేర్కొన్నారు. అంతే కాక, ఇటువంటి ప్రచారాల్ని ఎవరూ చెయ్యద్దు అని ఆయన హెచ్చరించినట్లు వార్త కథనాలు పేర్కొన్నాయి.

సమయం తెలుగు రాసిన ఒక కథనాన్ని బట్టి, మే 2023లో పౌరసరఫరాలశాఖ అధికారులు, రేషన్ కార్డులు జారీ చెయ్యటానికి తమకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు అని చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇంటర్నెట్లో లభించిన సమాచారం ప్రకారం, తెలంగాణా ప్రభుత్వం చివరిగా 2021లో కొత్త రేషన్ కార్డులని జారీ చేసింది (ఇక్కడ మరియు ఇక్కడ). 

చివరిగా,  తెలంగాణా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుంది అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.

Share.

About Author

Comments are closed.

scroll