కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాస్క్ ధరించి గురుద్వారాలో లంగర్ (భోజనం) చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. నిజానికి రాహుల్ గాంధీ అక్కడ తినలేదని, కేవలం ఫోటో కోసం మాత్రమే భోజనం ముందు కూర్చొని ఫోజులిచ్చాడని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాస్క్ ధరించి గురుద్వారాలో లంగర్ (భోజనం) చేస్తున్న దృశ్యాలు
.ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీ పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల అమృత్సర్లోని శ్రీ హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్)ని సందర్శించినప్పుడు తీసిన వీడియో ఇది. రాహుల్ గాంధీ లంగర్ తినడాన్ని ప్రారంభించకముందు తీసిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. తినే సమయంలో రాహుల్ గాంధీ మాస్క్ ధరించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోలోని స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ వీడియోని పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అమృత్సర్లోని శ్రీ హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్)ని సందర్శించినప్పుడు తీసినట్టు తెలిసింది. శ్రీ హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్)లో తను భోజనం చేసిన వీడియోని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ హండిల్‌లో షేర్ చేసారు. ఈ వీడియోలో రాహుల్ గాంధీ తన మొఖంపై ధరించిన మాస్కుని తీసివేసి భోజనం చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోస్టులో షేర్ చేసిన వీడియో, రాహుల్ గాంధీ తినడాన్ని ప్రారంభించక ముందు తీసిన దృశ్యాలని చూపిస్తుంది.
శ్రీ హర్మందిర్ సాహిబ్ గురుద్వారాలో రాహుల్ గాంధీ మాస్క్ తొలగించి భోజనం చేసిన ఫోటోలని, వీడియోలని పలు వార్తా సంస్థలు పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో, శ్రీ హర్మందిర్ సాహిబ్ గురుద్వారలో రాహుల్ గాంధీ తినడాన్ని ప్రారంభించక ముందు తీసిన దృశ్యాలని చూపిస్తున్నట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు .
ఇదివరకు, తమిళనాడులో జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో రాహుల్ గాంధీ తన భోజనం ముగించుకొని తనతో పాటు కూర్చున్న వ్యక్తులతో మాస్క్ ధరించి మాట్లాడిన ఫోటోలని ఇదే క్లెయింతో సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫ్యాక్ట్‌లీ దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
చివరగా, రాహుల్ గాంధీ శ్రీ హర్మందిర్ సాహిబ్ గురుద్వారాలో తినడం ప్రారంభించక ముందు తీసిన వీడియోని రాహుల్ గాంధీ మాస్క్ ధరించి భోజనం చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.