Fake News, Telugu
 

డ్రైవర్ బస్సులో నమాజ్ చేస్తున్న ఈ ఘటన దుబయ్‌లో జరిగింది

0

హిందూ ప్రయాణికులందరినీ బైట నిలబెట్టి ఏసీ బస్సులో నమాజ్ చేసుకుంటున్న ముస్లిం డ్రైవర్ అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. హిందువులారా కళ్ళు తెరవండి అంటూ ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా ఈ ఘటన మన దేశంలో జరిగిందన్నట్టు సూచిస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హిందూ ప్రయాణికులందరినీ బైట నిలబెట్టి ఏసీ బస్సులో నమాజ్ చేసుకుంటున్న ముస్లిం డ్రైవర్ వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ ఘటన దుబయ్‌లో జరిగింది. ఆ బస్సుపై దుబాయ్ అని స్పష్టంగా రాసి ఉంది. అలాగే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెబ్‌సైట్‌లో అడ్రస్  మరియు ఇతర వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ బస్సులో ప్రయాణించిన ఒక మహిళ డ్రైవర్ అందరు ప్రయాణికుల అనుమతి తీసుకున్నాకే నమాజ్ చేసుకున్నాడని తెలిపింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

డ్రైవర్ బస్సులో నమాజ్ చేస్తున్న ఈ ఘటన మన దేశంలో జరిగింది కాదు, దుబయ్‌లో జరిగింది. పైగా నమాజ్ చేసుకునే ముందు ఆ డ్రైవర్ ప్రయాణికులందరి అనుమతి కూడా తీసున్నాడు.

ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ బస్సు దుబయ్‌కి చెందిందని చెప్పడానికి పలు ఆదారాలు కనిపిస్తాయి. బస్సుపై ‘Dubai’ అని, దుబయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెబ్‌సైట్‌లో అడ్రస్  ‘www.rta.ae’ మరియు బస్సుపై ఉన్న ఎల్‌ఈడీ నేమ్ ప్లేట్‌పై దుబయ్‌లోని ‘Mall of Emirates Bus Stn’ కనిపిస్తుంది. ఈ వివరాల ఆధారంగా ఇది దుబయ్‌లో జరిగినట్టు అర్ధం చేసుకోవచ్చు.

ఇకపోతే ఈ ఘటన జరిగిన సమయంలో ఆ బస్సులో ప్రయాణించిన ఒక మహిళ ట్విట్టర్ ద్వారా ఇదే వీడియోను షేర్ చేసింది. దుబయ్‌లో బస్సు డ్రైవర్ ప్రార్థన చేసుకోడానికి 5 నిమిషాల సమయం కావాలని కోరినప్పుడు, ప్రయాణికులు ఎలాంటి అభ్యంతరం లేకుండా వేచి ఉన్నారంటూ ఈ నెల 11న ఈ వీడియోను షేర్ చేసింది.

ఐతే ఈ ట్వీట్‌కు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ రిప్లై కూడా ఇచ్చింది. ఈ ఘటనను తాము ఇన్వేస్టిగేట్ చేసామని, పనివేళల వెలుపలే డ్రైవర్ ఇలా నమాజ్ చేసినట్టు తెలిపింది. ప్రయాణికులు బైట నిలబడడాన్ని ఉద్దేశించి, RTA నియమాలు ప్రకారం, షెడ్యూల్ చేయబడిన ట్రిప్ సమయానికి ముందు/తర్వాత బస్సులోకి ప్రవేశించడానికి ఎవరూ అనుమతించబడరని తెలిపింది.

ఆ తరవాత దీనికి ఆ మహిళ బదులిస్తూ, డ్రైవర్ ప్రయాణికులందరి అనుమతి తీసుకున్న తరవాతే నమాజ్ చేసుకొని, తిరిగి ప్రయాణికులను ఎక్కించుకొన్నాడని తెలిపింది. ఐతే ఈ వివరాల బట్టి ఈ ఘటన దుబయ్‌లో జరిగిందని, పైగా ఆ డ్రైవర్ ప్రయాణికుల అనుమతితోనే బస్సులో నమాజ్ చేసుకున్నాడని స్పష్టమవుతుంది.

చివరగా, డ్రైవర్ బస్సులో నమాజ్ చేస్తున్న ఈ ఘటన దుబయ్‌లో జరిగింది. పైగా ఆ డ్రైవర్ ప్రయాణికుల అనుమతితోనే ఇలా చేసాడు.  

Share.

About Author

Comments are closed.

scroll