Fake News, Telugu
 

ట్రినిడాడ్ & టొబాగో దేశంలో వ్యాయామం చేస్తున్న భార్యభర్తల వీడియోని భారతదేశంలో లవ్ జిహాద్ అని షేర్ చేస్తున్నారు

0

మహిళల జిమ్ యొక్క వీడియోను చూస్తున్నారు. బిలాల్ అహ్మద్ ఖాన్ కి చెందిన జిమ్ ఢిల్లీలో ఉంది……హిందువుల యువతులను బుట్టలో వేయడానికి వారు జిమ్ ముసుగులో జిహాదీ కేంద్రంలను నడుపుతున్నారు……వారికి లవ్ జిహాద్ శిక్షణ ఇస్తున్నారు’, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీ లో ఉన్న మహిళల జిమ్ లో చేస్తున్న వ్యాయామం వీడియో. లవ్ జిహాద్ ద్వారా అమ్మాయిలను బుట్టలో వేస్తున్నారు.

ఫాక్ట్: వీడియోలో కనిపిస్తున్న జిమ్ ఉన్నది ట్రినిడాడ్ & టొబాగో లో; ఇండియా లో కాదు. వీడియోలో ఉన్న ట్రైనర్ ఇమ్రాన్ మరియు రేష్మా రజాక్ భార్యభర్తలు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో గురించి ఇంటర్నెట్ లో వెతకగా, వీడియో ట్రినిడాడ్ & టొబాగో దేశానికి చెందిన ఇమ్రాన్ అనే జిమ్ ట్రైనర్ కి సంబంధించిందని తెలిసింది. ‘బాడీ బై ఇమ్రాన్’ కి సంబంధించిన ఫేస్బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలు వీడియోని 2017 లో పోస్ట్ చేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. పోస్ట్ లోని వీడియో లాంటి చాలా వీడియోలు ఆ పేజీలో చూడవొచ్చు.

వీడియోలో ఉన్న ఇమ్రాన్ మరియు రేష్మా రజాక్ భార్యభర్తలు అని వారి ఫేస్బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్స్ చూస్తే తెలుస్తుంది. అంతేకాదు, వీడియోలో ఉన్నది తన భార్య అని, తాము ఇద్దరం ఒకే మతానికి చెందినట్టు 2020 లో ‘ఆల్ట్ న్యూస్’ వారితో మాట్లాడుతూ ఇమ్రాన్ తెలిపాడు.

వీడియోలో కనిపిస్తున్న జిమ్ ఉన్నది ట్రినిడాడ్ & టొబాగో లో; ఇండియా లో కాదు. వాళ్ళు వ్యాయయం చేస్తున్నది ట్రినిడాడ్ & టొబాగో లోని ‘లాంగ్ సర్కులర్ జిమ్’ లో అని పెట్టిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, వీడియోలో ఉన్న ట్రైనర్ ఇమ్రాన్ మరియు రేష్మా రజాక్ భార్యభర్తలు; జిమ్ ఉన్నది ట్రినిడాడ్ & టొబాగో లో.

Share.

About Author

Comments are closed.

scroll