‘ములుగు జిల్లా మేడారం గ్రామాన్ని పూర్తిగా ఆదీనంలోకి తీసుకున్న జంపన్న వాగు…చరిత్రలో మొట్టమొదటి సారిగా గ్రామన్నే చుట్టేసిన వర్షపు నీరు’ అని చెప్తూ, మట్టిలో కూరుకుపోయిన ఇళ్ళు , వాహనాల ఫోటోలతో కూడిన పోస్ట్ ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్ (దావా): తెలంగాణలో ములుగు జిల్లాలో వర్షానికి మట్టిలో కూరుకుపోయిన ఇళ్ళు, వాహనాల ఫోటలు.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటోలు తెలంగాణలోని ములుగు జిల్లాకి సంబంధించినవి కావు. అవి రాజస్తాన్ లోని జైపూర్ కి సంబంధించిన ఫోటోలు. జైపూర్ లో తాజాగా భారీ వర్షాల కారణంగా అలా మట్టిలో ఇళ్ళు, వాహనాలు కూరుకుపోయాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఎటువంటి సెర్చ్ రిజల్ట్స్ రావు. అయితే అవే ఫోటోలు పెట్టి, అవి రాజస్తాన్ లోని జైపూర్ కి సంబంధించినవని కొందరు ఫేస్బుక్ లో పెట్టినట్టు తెలుస్తుంది. కావున, కీ-వర్డ్స్ తో గూగుల్ లో వెతకగా, ఆ ఘటన కి సంబంధించిన చాలా ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. పోస్ట్ చేసిన ఫోటోలలోని ఇళ్ళు, వాహనాలు జైపూర్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలలో చూడవొచ్చు. కావున, పోస్ట్ లోని ఫోటోలు జైపూర్ లో తాజాగా భారీ వర్షాల కారణంగా మట్టిలో ఇళ్ళు, వాహనాలు కూరుకుపోయాయినప్పుడు తీసినవి.
చివరగా, పోస్ట్ లోనివి రాజస్తాన్ లోని జైపూర్ లో తీసిన ఫోటోలు; తెలంగాణ లోని ములుగు జిల్లాలో తీసిన ఫోటోలు కావు.