Fact Check, Fake News, Telugu
 

బంగ్లాదేశ్ కు సంబంధించిన వీడియోని భారతదేశంలో ఒక మౌల్వి చిన్నపిల్లాడిని హింసిస్తున్న ద్రుశ్యాలని షేర్ చేస్తున్నారు

0

భారత దేశంలోని మదర్సాలో ఒక మౌల్వి చిన్న పిల్లాడిని హింసిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. 70 సంవత్సరాలుగా సెక్యూలర్ ప్రభుత్వాలు మదర్సాలను ప్రోత్సహించి సాధించింది ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశంలోని మదర్సాలో ఒక మౌల్వి చిన్నపిల్లాడిని హింసిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న సంఘటన బంగ్లాదేశ్ చిట్టగాంగ్ లో ఉన్న మదర్సాలో చోటుచేసుకుంది. వీడియోలో కనిపిస్తున్న బాలుడు, తన పుట్టినరోజు నాడు కలవడానికి వచ్చిన తల్లి తో పాటే వెళ్తానని మారం చేయడంతో, MD యహ్య అనే మదర్సా టీచర్ అతన్ని ఇలా చితకబాదినట్టు తెలిసింది. ఈ వీడియో భారత దేశానికి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ ప్రజలని తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం గూగుల్ లో వెతికితే, వీడియోలో కనిపిస్తున్న ఈ సంఘటన గురించి రిపోర్ట్ చేస్తూ 10 మర్చి 2021 నాడు పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ దొరికింది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ నగరంలో ‘Al Markazul Quran Islamic Academy’ మదర్సాకి చెందిన MD యహ్య అనే టీచర్, ఒక చిన్నపిల్లాడిని విచక్షణ రహితంగా కొడుతూ హింసించినట్టు ఆర్టికల్ లో తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న బాలుడు, తన పుట్టినరోజు నాడు కలవడానికి వచ్చిన తల్లి తో పాటే వెళ్తానని మారం చేసినందుకు MD యహ్య అతన్ని ఇలా చితకబాదినట్టు ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, లోకల్ అధికారులు వెంటనే ఆ బాలుడిని కాపాడారు. అంతేకాదు, మదర్సా నిర్వాహకులు ఆ టీచర్ ని విధుల నుంచి తొలగించినట్టు ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు. బంగ్లాదేశ్ లో జరిగిన ఈ సంఘటన గురించి పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో భారత దేశానికి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, బంగ్లాదేశ్ మదర్సాకు సంబంధించిన వీడియోని చూపిస్తూ భారతదేశంలోని మదర్సాలో ఒక మౌల్వి చిన్నపిల్లాడిని హింసిస్తున్న ద్రుశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll