Fake News, Telugu
 

ఈ వీడియోలో రొమేనియా పోలీసులు కొడుతున్నది మాస్క్ ధరించకుండా ఇతరుల పై ఉమ్మేసినందుకు కాదు

0

‘ఫ్రాన్స్ దేశంలోని పారిస్ మెట్రో రైల్లో ఇస్లామిక్ తీవ్రవాదులకు చెందిన వాడు మాస్క్ ధరించకుండా ఇతర ఫ్రాన్స్ పౌరులపై ఉమ్మి వేయడంతో పోలీసులు మంచి సత్కారం చేశారు’, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పారిస్ మెట్రో రైల్లో మాస్క్ ధరించకుండా ఇతరుల పై ఉమ్మేసినందుకు ముస్లిం తీవ్రవాదులను పోలీసులు కొడుతున్న వీడియో.

ఫాక్ట్: ఆ వీడియో ఫ్రాన్స్ లోని పారిస్ కి చెందినది కాదు. అది రొమేనియా దేశానికి సంబంధించిన వీడియో. రెండు ఫుట్బాల్ టీం లకు చెందిన ఫాన్స్ గొడవపడకుండా పోలీసులు ఆపినప్పుడు, వారిలో కొందరు పోలీసులను కొట్టి మెట్రో రైల్లో ఎక్కడంతో వారిని పోలీసులు పట్టుకుంటున్నప్పుడు తీసిన వీడియో. వారి దగ్గర చట్టవిరుద్ధమైన ఆయుధాలు కూడా దొరికాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని అక్టోబర్ 2020 లో పలు మీడియా సంస్థలు ప్రచురించినట్టు తెలుస్తుంది. రొమేనియా మీడియా సంస్థ ‘డీజీ 24’ వారు ప్రచురించిన ఆర్టికల్ లో ఆ వీడియో బుకారెస్ట్ (రొమేనియా) కి సంబంధించినదని చూడవొచ్చు. రెండు ఫుట్బాల్ టీం లకు చెందిన ఫాన్స్ గొడవపడకుండా పోలీసులు ఆపినప్పుడు, వారిలో కొందరు పోలీసులను కొట్టి మెట్రో రైల్లో ఎక్కడంతో వారిని పోలీసులు పట్టుకుంటున్నప్పుడు తీసిన వీడియో అని ఆ ఆర్టికల్ లో చదవొచ్చు. వారి దగ్గర చట్టవిరుద్ధమైన ఆయుధాలు కూడా దొరికాయని తెలుస్తుంది. ఇతర వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

ఈ ఘటన పై రొమేనియా అధికారులు చేసిన పోస్ట్ లను ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. అంతేకాదు, వీడియోలోని రైలు బుకారెస్ట్ కి సంబంధించిన రైలుతో పోలి ఉన్నట్టు మరియు ‘Ștefan cel Mare’ మెట్రో స్టేషన్ కి సంబంధించిన ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. వీడియోలోని వ్యక్తుల మతపరమైన వివరాలు తెలియలేదు.

చివరగా, పోస్ట్ లోని వీడియోకీ, ఫ్రాన్స్ కి అసలు సంబంధంలేదు. అది రొమేనియా దేశంలో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll