Fake News, Telugu
 

పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన వీడియోని బంగ్లాదేశ్‌, శ్రీలంకకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

Update (19 June 2023):

ఇదే వీడియోని ‘శ్రీలంకలోని గ్రామంలో ముస్లిం జనాభా పెరగడంతో హిందూ దేవాలయాన్ని ద్వసం చేస్తున్న ముస్లింలు…’ అంటూ సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. అయితే క్రింద వివరించినట్టు, ఈ వీడియో ఆగష్టు 2021లో పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని సిధ్ధి వినాయక్ ఆలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించింది. అలాగే ధ్వంసం అయిన ఆలయానికి మరమ్మతుల చేసి హిందూ సమాజానికి అప్పగించినట్టు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి.

Published (18 October 2021):

ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడి చేసి, ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో కొందరు వ్యక్తులు హిందూ దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడికి సంబంధించింది అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో ఆగష్టు 2021లో పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని సిధి వినాయక్ ఆలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించింది. ఈ వీడియోని అప్పట్లో అన్ని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై ఇటీవల దాడులు జరిగినప్పటికీ, ఈ వీడియోకి బంగ్లాదేశ్‌కి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్‌లో వెతకగా, ఈ వీడియో ఆగస్ట్ 2021లో పాకిస్తాన్‌లో జరిగిన ఘటనకి సంబంధించినదిగా తెలిసింది. ఈ వీడియోని అనేక భారతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ కథనాల ప్రకారం పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని సిధి వినాయక్ ఆలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేసారు.

ఈ వీడియో పాకిస్తాన్‌లో హిందూ ఆలయంపై జరిగిన దాడిది అంటూ రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఈ దాడికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఈ దాడిపై దర్యాప్తునకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశించినట్టు పాకిస్తాన్ వార్తా కథనాలు ప్రచురించాయి. అలాగే ధ్వంసం అయిన ఆలయానికి మరమ్మతుల చేసి హిందూ సమాజానికి అప్పగించినట్టు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి.

ఇదిలా ఉండగా ఇటీవల బంగ్లాదేశ్‌లో ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌పై చెలరేగిన వివాదం నేపథ్యంలో అక్కడి ముస్లింలు హిందూ దేవాలయాలని ధ్వంసం చేసారు. ఈ దాడులకు సంబంధించిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే పోస్టులో షేర్ చేసిన వీడియోకి, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడులకు ఎటువంటి సంబంధంలేదు.

చివరగా, పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన వీడియోని బంగ్లాదేశ్‌లో జరిగిన ఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll